Home /News /sports /

IPL 2022 CSK VS KKR LIVE SCORES DREAM START FOR KKR AGAINST CSK IN IPL 2022 SEASON UMESH YADAV TAKES RUTURAJ GAIKWAD WICKET SJN

IPL 2022: నోబాల్, వైడ్, వికెట్... డకౌట్ గా వెనుదిరిగిన గతేడాది ఆరెంజ్ క్యాప్ హీరో

రుతురాజ్ గైక్వాడ్ (ఫైల్ ఫోటో)

రుతురాజ్ గైక్వాడ్ (ఫైల్ ఫోటో)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ () 15వ సీజన్ ను కేకేఆర్ అద్భుతంగా ఆరంభించింది. తొలి ఓవర్ లోనే గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ శ్రేయస్ అయ్యర్ వికెట్ ను తీసి శుభారంభం చేసింది.

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) అద్భుతంగా ఆరంభించింది. టాస్ గెలిచిన కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) బౌలింగ్ ఎంచుకోగా... చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad), న్యూజిలాండ్ ప్లేయర్ డెవోన్ కాన్వే వచ్చారు. తొలి ఓవర్ వేయడానికి వచ్చిన ఉమేశ్ యాదవ్... తొలి బంతినే నో బాల్ గా వేశాడు. దాంతో ఐపీఎల్ 15వ సీజన్ నో బాల్ తో ఆరంభమైంది. తొలి బంతిని నోబాల్... ఆ తర్వాత మరో వైడ్ వేసిన ఉమేశ్... అద్భతమైన అవుట్ స్వింగర్ డెలివరీతో రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ను సాధించాడు. గతేడాది ఆరెంజ్ క్యాప్ సాధించిన గైక్వాడ్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు.

మ్యాచ్ కు ముందర ఇటీవల గుండెపోటుతో మరణించిన స్పిన్ లెజెండ్ షేన్ వార్నర్ కు ఐపీఎల్ నివాళులు అర్పించింది. అతడు కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ ను తొలి ఎడిషన్ లో చాంపియన్ గా నిలిపిన నాటి వీడియోను స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై చూపిస్తూ అతడికి నివాళులు అర్పించారు.

హెడ్ టు హెడ్ రికార్డులు :

ఐపీఎల్ లో రెండు జట్లు మొత్తంగా 28 సార్లు తలపడ్డాయ్. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ దే పై చేయి. చెన్నై 19 సార్లు నెగ్గగా.. కోల్ కతా మరో 9 మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.

తుది జట్లు అంచనా :

చెన్నై సూపర్ కింగ్స్ : డేవాన్ కాన్‌వే, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎం ఎస్ ధోని, రవీంద్ర జడేజా(కెప్టెన్), డ్వేన్ బ్రేవో, ఆడమ్ మిల్నే, శాంట్నర్ , దేశ్ పాండే

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్,  ఉమేశ్ యాదవ్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, జాక్సన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు