Home /News /sports /

IPL 2022 CSK VS KKR KOLKATA KNIGHT RIDERS BEAT CHENNAI SUPER KINGS BY 6 WICKETS AND REGISTER THEIR FIRST WIN IN IPL 2022 SEASON SJN

IPL 2022: రహానే అదరహో... చెమట పట్టకుండ ఛేజింగ్ ను పూర్తి చేసిన కేకేఆర్

రహానే, వెంకటేశ్ అయ్యర్ (PC: IPL TWITTER)

రహానే, వెంకటేశ్ అయ్యర్ (PC: IPL TWITTER)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders) బోణీ కొట్టింది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్ లో కోల్ కతా అదరగొట్టింది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders) బోణీ కొట్టింది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్ లో కోల్ కతా అదరగొట్టింది. చెన్నై నిర్దేశించిన టార్గెట్ ను చెమట పట్టకుండా ఛేదించేసింది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలోని కేకేఆర్ 6 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించింది. తద్వారా గతేడాది ఫైనల్లో చెన్నై చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లయ్యింది. తొలిసారి కెప్టెన్ గా బరిలోకి దిగిన రవీంద్ర జడేజాకు ఈ మ్యాచ్ నిరాశనే మిగిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. టీం మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా (28 బంతుల్లో 26 నాటౌట్; 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఫర్వాలేదనిపించారు.

వాంఖడే లాంటి బ్యాటింగ్ పిచ్ పై 132 పరుగులను ఛేదించడం అంటే పెద్ద కష్టమేమి కాదు. అందులోనూ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ లాంటి హిట్టర్లు ఉన్న టీంకు ఈ స్కోరు పెద్ద స్కోరు కూడా కాదు. ఛేజింగ్ లో కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. కేకేఆర్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన అజింక్యా రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (16) శుభారంభం చేశారు. వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా (21) కూడా రాణించడంతో కేకేఆర్ ఛేజింగ్ సాఫీగానే సాగింది. అయితే బ్రావో రెండు వికెట్లు తీయడం... సాంట్నర్ బౌలింగ్ లో రహానే అవుటవ్వడంతో మ్యాచ్ పై కాస్త ఉత్కంఠ నెలకొంది.  అయితే క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్), స్యామ్ బిల్లింగ్స్ (21 బంతుల్లో 25; 1 ఫోర్ ,1 సిక్స్) కేకేఆర్ కు విజయాన్ని ఖాయం చేశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. తొలి ఓవర్లో గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ కాన్వే (3) కూడా పెవిలియన్ కు తొందరగానే చేరుకున్నాడు. అయితే ఈ దశలో జట్టు భారం అనుభవం ఉన్న రాబిన్ ఉతప్ప (28), అంబటి రాయుడు (15) మీద పడింది. ఉతప్ప ఫోర్, సిక్సర్ తో ఫామ్ లో ఉన్నట్లే కనిపించాడు. అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పిచ్ ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. జడేజాతో సమన్వయ లోపంతో అంబటి రాయుడు కూడా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (3) కూడా క్రీజులో ఎంతో సేపు నిలువలేదు. అయితే ఆఖర్లో ధోని ధనాధన్ షాట్లతో చెలరేగడంతో చెన్నై 130 మార్కును దాటగలిగింది. 2019 తర్వాత ఐపీఎల్ లో ధోని చేసిన తొలి అర్ధ సెంచరీ ఇదే కావం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, MS Dhoni, Ravindra Jadeja, Shreyas Iyer

తదుపరి వార్తలు