IPL 2022 CSK VS KKR KKR CAPTAIN WON THE TOSS AND CHOOSE TO FIELD FIRST SJN
IPL 2022: తొలి ఐపీఎల్ ధమాకాలో టాస్ కోల్ కతాదే... ముగ్గరు విదేశీ ప్లేయర్స్ తోనే బరిలోకి దిగనున్న కేకేఆర్
IPL 2022 - CSK vs KKR
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తొలి మ్యాచ్ టాస్ ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) టాస్ ఓడిపోయింది. మహేంద్ర సింగ్ ధోని (Ms dhoni) తప్పుకోవడంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సీజన్ ఆరంభ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ తొలి మ్యాచ్ టాస్ ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) టాస్ ఓడిపోయింది. మహేంద్ర సింగ్ ధోని (Ms dhoni) తప్పుకోవడంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సీజన్ ఆరంభ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight riders), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. కోల్ కతా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ () టాస్ ను గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోయిన చెన్నై చేసేదేం లేక బ్యాటింగ్ కు దిగనుంది. కేకేఆర్ తరఫున శ్రేయస్ అయ్యర్ కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. అతడితో పాటు రహానే, ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ బిల్లింగ్స్ కూడా కేకేఆర్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ తో కాకుండా ముగ్గరు విదేశీ ఆటగాళ్లతోనే శ్రేయస్ బరిలోకి దిగనున్నాడు. డ్యూ ఫ్యాక్టర్ ఉండటంతో టాస్ గెలిచిన వెంటనే మరో మాటకు తావు లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
మరోవైపు ఐదోసారి ఐపీఎల్ చాంపియన్ గా నిలవాలనుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ను ప్రత్యర్థుల కంటే కూడా సొంత ప్లేయర్సే ఎక్కవగా భయపెడుతున్నారు. వేలంలో ఏరి కోరి రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చహర్... గాయంతో ఐపీఎల్ లో ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ కూడా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే అతడికి తుది జట్టులో చెన్నై చోటు కల్పించింది.
ప్రస్తుతం అతడు కోలుకున్నప్పటికీ.. తిరిగి పూర్తిగా ఫామ్లోకి వచ్చాడా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. అటు వీసా జాప్యత కారణంగా ఆల్రౌండర్ మొయిన్ అలీ.. గాయం కారణంగా పేస్ బౌలర్ దీపక్ చాహార్ మొదటి మ్యాచ్కు దూరం కానున్నారు. అలాగే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని జడేజాకు సారధ్య బాధ్యతలు ఇవ్వడంతో.. చెన్నైకి అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఐపీఎల్ లో రెండు జట్లు మొత్తంగా 28 సార్లు తలపడ్డాయ్. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ దే పై చేయి. చెన్నై 19 సార్లు నెగ్గగా.. కోల్ కతా మరో 9 మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.