Home /News /sports /

IPL 2022 CSK VS KKR CSK IN BIG TROUBLE THEY LOST FIVE WICKETS SJN

CSK vs KKR: తొలి మ్యాచ్ లో చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్... అప్పుడే సగం వికెట్లు గోవిందా!

రాబిన్ ఉతప్ప వికెట్ తీసిన ఆనందంలో కేకేఆర్ ప్లేయర్స్(PC: IPL TWITTER)

రాబిన్ ఉతప్ప వికెట్ తీసిన ఆనందంలో కేకేఆర్ ప్లేయర్స్(PC: IPL TWITTER)

CSK vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో జరుగుతోన్న మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) తడబడుతోంది.  డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగు పెట్టిన చెన్నై... తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది.

ఇంకా చదవండి ...
CSK vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో జరుగుతోన్న మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) తడబడుతోంది.  డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగు పెట్టిన చెన్నై... తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని (MS DHONI) తప్పుకోవడంతో... కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అతని స్థానంలో సారథ్య బాధ్యతలను తీసుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయం కరెక్టే అని కేకేఆర్ బౌలర్లు నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 13 ఓవర్లలో 5 వికెట్లకు 66 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. జడేజా (11), ధోని (2) క్రీజులో ఉన్నారు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. తొలి ఓవర్లో గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ కాన్వే (3) కూడా పెవిలియన్ కు తొందరగానే చేరుకున్నాడు. అయితే ఈ దశలో జట్టు భారం అనుభవం ఉన్న రాబిన్ ఉతప్ప (28), అంబటి రాయుడు (15) మీద పడింది. ఉతప్ప ఫోర్, సిక్సర్ తో ఫామ్ లో ఉన్నట్లే కనిపించాడు. అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పిచ్ ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. జడేజాతో సమన్వయ లోపంతో అంబటి రాయుడు కూడా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (3) కూడా క్రీజులో ఎంతో సేపు నిలువలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders

తదుపరి వార్తలు