IPL 2022 CSK VS GT LIVE SCORES GUJARAT TITANS BOWLERS SUCCESSFULLY RESTRICTED CHENNAI SUPER KINGS FOR LOW SCORE IN IPL 2022 SEASON SJN
CSK vs GT : ధోని ఢమాల్.. బ్యాటింగ్ లో చెన్నై మరోసారి ఫ్లాప్ షో.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
వికెట్ తీసిన ఆనందంలో రషీద్ ఖాన్ (PC : IPL)
CSK vs GT : చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటింగ్ మరోసారి నిరాశ పరిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు చేసింది.
CSK vs GT : చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటింగ్ మరోసారి నిరాశ పరిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), నారాయణ్ జగదీశన్ (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారు పెద్దగా ఆడలేకపోయారు. ధోని (7) నిరాశ పరిచాడు. మొహమ్మద్ షమీ 2 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిషోర్ తలా ఒక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. చెన్నై ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని దూరం చేసుకుంది.
టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే గత మ్యాచ్ ల్లోలాగా చెన్నై జట్టుకు ఓపెనర్ల నుంచి శుభారంభం లభించలేదు. మూడో ఓవర్లోనే డెవోన్ కాన్వే (5) కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవలియన్ కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (21; 2 సిక్సర్లు) ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. రెండో వికెట్ కు రుతురాజ్ తో కలిసి అలీ 57 పరుగులు జోడించాడు. దాంతో చెన్నై బ్యాటింగ్ గాడిలో పడిందని అంతా భావించారు. అయితే అలీ వికెట్ ను తీసిన సాయి కిషోర్ చెన్నైని కోలుకోనీకుండా చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తొలి మ్యాచ్ ఆడుతోన్న జగదీశన్ ఫర్వాలేదనిపించాడు. చివర్లో ధోని భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. దాంతో చెన్నై 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.