IPL 2022 CSK VS DC CHENNAI SUPER KINGS MS DHONI CONFUSES FIELD UMPIRE WITH HIS APPEAL WATCH VIDEO SRD
IPL 2022 - Viral Video: అట్లుంటది మరి ధోనితోని.. అంపైర్ అయినా సరే తికమక పడాల్సిందే..!
ధోని (ఫైల్ ఫోటో)
IPL 2022 - Viral Video: ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఔట్ విషయంలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఫీల్డ్ అంపైర్లదగ్గర నుంచి థర్డ్ అంపైర్ల వరకు తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదానికి కేంద్రంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. అంపైర్లు చేస్తోన్న తప్పిదాలతో జట్ల ఫలితాలు తారుమారు అవుతున్నాయ్. ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఔట్ విషయంలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. లేటెస్ట్ గా ఫీల్డ్ అంపైర్ ఔట్ సిగ్నల్ ఇవ్వడంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. గురువారం ముంబై ఇండియన్స్, సీఎస్కే (MI vs CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆరో ఓవర్ సమర్జిత్ సింగ్ వేశాడు. ఆ ఓవర్లో ఒక బంతిని సమర్జిత్ బ్యూటిఫుల్ ఇన్‌స్వింగర్ వేయగా.. ముంబై బ్యాటర్ హృతిక్ సోకీన్ ఎడ్జ్‌ను దాటుతూ కీపర్ ధోని చేతుల్లో పడింది.
అయితే బ్యాట్‌కు తాకిన శబ్ధం వినిపించడంతో ధోని(MS Dhoni) అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ కాస్త డైలమాలో పడి మొదట వైడ్ అనుకొని వైడ్ సిగ్నల్ ఇవ్వబోతూ వెంటనే యాంగిల్ మార్చి ఔట్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. ధోని వల్లే అంపైర్ తికమక పడ్డారు. మైదానంలో ధోనిది మాస్టర్ మైండ్. ధోని రివ్యూ తీసుకున్నాడంటే.. అది సరైందే అని చాలా సార్లు నిరూపితమైంది. ఇక, ధోని ప్రతి దానికీ అప్పీల్ చేయడు. అది ఔట్ అన్పిస్తేనే అప్పీల్ కు వెళతాడు. దీంతో.. నిన్నటి మ్యాచులో ధోని అప్పీల్ చేసే సరికి అంపైర్ డైలామాలో పడ్డాడు. చివరికి.. థర్డ్ అంపైర్ దానిని నాటౌట్ గా తేల్చాడు. దీంతో.. ఈ వీడియోపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అట్లుంటది మరి ధోనితోని.. అని కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు.. ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసింది. కాస్తో కూస్తో ఉన్న ప్లే ఆఫ్స్ ఆశలను కూడా చెత్తాటతో ఆ జట్టు చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు అందరి కన్నా ముందే వరుస పరాజయాలతో లీగ్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ముంబై.. వెళ్తూ వెళ్తూ డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నైని వెంట తీసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ(32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) కడవరకు నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చెన్నౌ బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.