హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : కొత్త పెళ్లి కొడుకా మజాకా.. ఫ్లయిట్ దిగగానే వీర కొట్టుడు కొట్టాడు.. అతడెవరంటే?

IPL 2022 : కొత్త పెళ్లి కొడుకా మజాకా.. ఫ్లయిట్ దిగగానే వీర కొట్టుడు కొట్టాడు.. అతడెవరంటే?

డెవోన్ కాన్వే (PC : CSK)

డెవోన్ కాన్వే (PC : CSK)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ఓపెనర్లు ఒకే మ్యాచ్ లో రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో మ్యాచ్ ముందు వరకు కూడా చెన్నై జట్టు ఓపెనర్లు కలిసి కట్టుగా రాణించింది లేదు.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ఓపెనర్లు ఒకే మ్యాచ్ లో రాణించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో మ్యాచ్ ముందు వరకు కూడా చెన్నై జట్టు ఓపెనర్లు కలిసి కట్టుగా రాణించింది లేదు. అయితే ఆదివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లుగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు రెచ్చిపోయి ఆడారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పరుగులు సాధించారు. ఆరంభంలో రుతురాజ్ మెరిస్తే.. ఇన్నింగ్స్ మధ్య నుంచి కాన్వే అలరించాడు. అయితే రుతురాజ్ 99 పరుగులు చేసి పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకోగా.. డెవోన్ కాన్వే మాత్రం 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇది కూడా చదవండి : రెండు స్థానాలు.. రేసులో ఏడు జట్లు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు ఏవంటే?

అయితే రుతురాజ్ ఇన్నింగ్స్ కు వచ్చినంత ప్రశంసలు కాన్వే ఇన్నింగ్స్ కు రాలేదు. అయినప్పటికీ.. కాన్వే ఇన్నింగ్స్ ను అద్భుతంతో పోల్చవచ్చు. ఎందుకంటే కాన్వేకు ఇది కేవలం రెండో ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కాన్వేను రూ. కోటీకి చెన్నై సొంతం చేసుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడికి అవకాశం ఇవ్వగా అతడు కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో కాన్వే బెంచ్ కే పరిమితం అయ్యాడు.

దీన్ని కూడా చదవండి  : దేన్నీ వదలని ధోని.. చివరకు ద్రవిడ్ పేరిట ఉన్న ఆ రికార్డు కూడా.. కెప్టెన్ కూల్ ఖాతాలోకే..

అయితే గత నెలలో కాన్వే తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం కాన్వే బయో బబుల్ ను వదిలి దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. వాస్తవానికి కాన్వే సౌతాఫ్రికాలో జన్మించాడు. అనంతరం న్యూజిలాండ్ కు వలస వెళ్లాడు. ప్రస్తుతం కివీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా కాన్వే కిమ్ వాట్సన్ ను గత నెలలో వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అతడు ఐపీఎల్ కోసం ఇండియాకు రాగా.. క్వారంటైన్ అనంతరం జట్టుతో చేరాడు. డ్వేన్ బ్రావో గాయపడటంతో మే 1న జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగాడు. ఇక ఈ మ్యాచ్ లో కొత్త పెళ్లికొడుకు హోదాలో ఆడిన కాన్వే అదరగొట్టాడు. 55 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.

రుతురాజ్ గైక్వాడ్, కాన్వే బ్యాటింగ్ వల్ల చెన్నై జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగుల చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసి ఓడిపోయింది. దాంతో చెన్నై జట్టు 13 పరుగులతో విజయం సాధించి సీజన్ లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్ తరఫున నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) జట్టు విజయం కోసం ఒంటిరి పోరాటం చేశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kane Williamson, MS Dhoni, Ravindra Jadeja, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు