హోమ్ /వార్తలు /క్రీడలు /

MS Dhoni Retention: ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు.. ధోనీని ఏకంగా మూడేళ్ల పాటు రిటైన్ చేసుకోనున్న సీఎస్కే.. లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..!

MS Dhoni Retention: ఇప్పట్లో రిటైర్మెంట్ లేదు.. ధోనీని ఏకంగా మూడేళ్ల పాటు రిటైన్ చేసుకోనున్న సీఎస్కే.. లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..!

ధోనీ మరో మూడేళ్ల పాటు సీఎస్కేతోనే.. రిటైన్ చేసుకోనున్న చైన్నై (PC: CSK)

ధోనీ మరో మూడేళ్ల పాటు సీఎస్కేతోనే.. రిటైన్ చేసుకోనున్న చైన్నై (PC: CSK)

IPL 2022: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఆయా జట్లు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. దీంతో ఎంఎస్ ధోనీని సీఎస్కే యాజమాన్యం మరో మూడు సీజన్ల పాటు రిటైన్ చేసుకోవాలని నిర్ణయించింది. ధోనీతో పాటు మరో ముగ్గురికి ఈ అవకాశం లభించనున్నది.

ఇంకా చదవండి ...

ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా వేలానికి (Mega Auction) ముందు పాత 8 ఫ్రాంచైజీలు నలుగురి చొప్పున ఆటగాళ్లను రిటైన్ (Players Retention) చేసుకోవడానికి మరో ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నది. అన్ని జట్లు నవంబర్ 30 మధ్యాహ్నం 12.00 గంటల లోపు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐకి (BCCI) తెలియజేయాల్సి ఉన్నది. ప్రతీ జట్టు అత్యధికంగా నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ఒక విదేశీ ముగ్గురు స్వదేశీ లేదా ఇద్దరు విదేశీ ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. అత్యధికంగా ఇద్దరు స్వదేశీ ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. మరోవైపు ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ కంటే ఎక్కువ రిటైన్ చేసుకోవడానికి వీలుండదు. ఈ సారి ప్రతీ జట్టుకు ప్లేయర్ పర్స్ వాల్యూను రూ. 90 కోట్లకు పెంచారు, అయితే రిటైన్ చేసుకుంటే ఆ మేరకు పర్స్ వాల్యూ నుంచి తగ్గిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. నలుగురికి కలిపి రూ. 42 కోట్లు పర్స్ వాల్యూ నుంచి చెల్లించాల్సి ఉన్నది.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) 2020 అగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతూ జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు. అయితే ధోనీ ఇక క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడని విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అయితే తాను రిటైర్ అయితే చెన్నై చేపాక్ స్టేడియంలోనే చివరి మ్యాచ్ ఆడతానని ఇటీవల సీఎస్కే ట్రోఫీ సెలబ్రేషన్స్‌లో చెప్పాడు. అంతే కాకుండా ఆ చివరి మ్యాచ్ వచ్చ ఏడాది ఆడతానా లేదా మరో ఐదేళ్ల తర్వాత ఆడతానా అనేది మాత్రం చెప్పలేనని ధోనీ స్పష్టం చేశాడు. దీంతో ధోనీ ఐపీఎల్ 2022 ఆడటం ఖాయంగానే కనిపించింది. దీన్ని నిజం చేస్తూ సీఎస్కే కూడా అతడిని రిటైన్ చేసుకోవడానికి సిద్దపడింది.

Bhuvneshwar Kumar: భువీ ఇంటిలో 'లిటిల్ ఏంజెల్'.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భువీ భార్య నుపుర్ నగార్


ఎంఎస్ ధోనీని ఏకంగా మూడేళ్ల పాటు రిటైన్ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావిస్తున్నది. అంటే ధోనీ మరో మూడేళ్ల పాటు క్రికెట్‌ను వీడే అవకాశం లేదు. అయితే రాబోయే మూడేళ్లలో ఏదో ఒక రోజు పూర్తిగా ఆటకు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక ధోనీతో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కూడా చెన్నై రిటైన్ చేసుకోబోతున్నది. గత కొన్నేళ్లుగా బంతితో పాటు బ్యాటుతో కూడా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో పలు మ్యాచ్‌లను గెలిపించిన రవీంద్ర జడేజాను తిరిగి జట్టులోకి తీసుకోనున్నారు. ఇక యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా రిటెన్షన్ లిస్టులో ఉన్నాడు. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ గెలవడంతో రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. అతడికి మరింత భవిష్యత్ ఉండటంతో రిటైన్ చేసుకోవడానికి సీఎస్కే సిద్దపడుతున్నది.

IND vs NZ: తొలి టెస్టుకు ముందు అశ్విన్‌ను ఊరిస్తున్న 3 రికార్డులు.. ఆ దిగ్గజాలను అధిగమించే అవకాశం


ఇక మిగిలిన ఒక స్పాట్‌లో విదేశీ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నది. మొయిన్ అలీ లేదా సామ్ కర్రన్ లేదా ఫాఫ్ డు ప్లెసిస్‌లో ఒకరికి చోటు దక్కనున్నది. వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతున్నదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అదే జరిగితే చెన్నైలోని చేపాక్ స్టేడియం వంటి స్లో వికెట్‌పై మొయిన్ అలీ ప్రభావం చూపించగలడు. ఒక వేళ అలీ ఐపీఎల్ ఆడటానికి సుముఖంగా లేకపోతే సామ్ కర్రన్‌ను చేర్చుకోవాలని భావిస్తున్నది. వీరిద్దరూ కాకుండా డు ప్లెసిస్‌ను కూడా మరో చాయిస్‌గా సీఎస్కే భావిస్తున్నది. బ్యాటింగ్ విభాగంలో డు ప్లెసిస్ బలమైన ఆటగాడు. ఈ సీజన్‌లో అతడు బాగా రాణించాడు. మొత్తానికి ముగ్గురు స్వదేశీ ఒక విదేశీ ప్లేయర్‌ను తీసుకోవడానికి సీఎస్కే సిద్దపడుతున్నట్లు సమాచారం.

First published:

Tags: Bcci, Chennai Super Kings, IPL 2022, MS Dhoni, Ravindra Jadeja

ఉత్తమ కథలు