Home /News /sports /

IPL 2022 CRICKET FANS TROLLS VIRAT KOHLI AS CHOKLI AND CHOCKER AFTER RCB VS RR MATCH SJN

RCB : కోహ్లీ కాదు చోక్లీ.. రన్ మిషిన్ ను దుమ్మెత్తి పోస్తున్న ట్రోలర్స్

విరాట్ కోహ్లీ (PC : TWITTER)

విరాట్ కోహ్లీ (PC : TWITTER)

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్  విరాట్ కోహ్లీ (Virat Kohli) ఏ మాత్రం కలిసిరాలేదు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్  విరాట్ కోహ్లీ (Virat Kohli) ఏ మాత్రం కలిసిరాలేదు. ఈ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే కీలకమైన నాకౌట్ పోరుల్లో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow SuperGaints)తో జరిగిన మ్యాచ్ లో రజత్ పటిదార్ సెంచరీ.. దినేశ్ కార్తీక్ మెరుపు ఫినిషింగ్ వల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) గట్టెక్కగా.. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో మాత్రం అది జరగలేదు. చెత్తాటతో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

దాంతో విరాట్ కోహ్లీపై మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. ఎలిమినేటర్ లో 25 పరుగులు చేసిన కోహ్లీ.. క్వాలిఫయర్ 2లో 7 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ’నువ్వు కోహ్లీవి కాదు చోక్లీవి‘ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. కీలక మ్యాచ్ ల్లో తడబడటం కోహ్లీకి అలవాటే. అతడి కెరీర్ మొత్తంలో కూడా బిగ్ గేమ్స్ లో ఆడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆర్సీబీ నుంచి కోహ్లీని తొలగించాలంటూ మరికొందరు డిమాండ్ కూడా చేస్తున్నారు.















తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (42 బంతుల్లో 58 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (13 బంతుల్లో 24 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు.  అనంతరం రాజస్తాన్ రాయల్స్  18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. జోస్ బట్లర్ ( 60 బంతుల్లో 106 పరుగులు నాటౌట్ ; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో సారి తన ఫామ్ కంటిన్యూ చేస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Glenn Maxwell, IPL, IPL 2022, Mohammed Siraj, Rajasthan Royals, Ravichandran Ashwin, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు