Home /News /sports /

IPL 2022 CRICKET FANS SLAMS RIYAN PARAG AFTER HE DROPS RCB BATTER RAJAT PATIDAR CATCH SJN

IPL 2022 : బిల్డప్ బాబాయ్ కాస్ట్ లీ మిస్టేక్.. ఫ్యాన్స్ చేతిలో దారుణంగా ట్రోల్..

రాజస్తాన్ రాయల్స్ (PC : IPL)

రాజస్తాన్ రాయల్స్ (PC : IPL)

IPL 2022 : అతడికిది కేవలం నాలుగో సీజన్ మాత్రమే.  ఇప్పటి వరకు ఆడిన 46 మ్యాచ్ ల్లో కేవలం 507 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ సీజన్ లో అయితే 16 మ్యాచ్ ల్లో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు.

IPL 2022 : అతడికిది కేవలం నాలుగో సీజన్ మాత్రమే.  ఇప్పటి వరకు ఆడిన 46 మ్యాచ్ ల్లో కేవలం 507 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ సీజన్ లో అయితే 16 మ్యాచ్ ల్లో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు. ఇతడు తమ జట్టుకు మంచి ఫినిషర్ అవుతాడని ఫిబ్రవరి నెలలో జరిగిన వేలంలో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఆడగా.. మిగతా అన్ని మ్యాచ్ ల్లో విఫలం అయ్యాడు. అతడెవరో కాదు రియాన్ పరాగ్ (Riyan Parag). ఆటతో కంటే కూడా విచిత్ర వేశాలతో.. ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు.

ఇది కూడా చదవండి  : కోహ్లీ కాదు చోక్లీ.. రన్ మిషిన్ ను దుమ్మెత్తి పోస్తున్న ట్రోలర్స్

ఇక ఇతడి ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా క్యాచ్ లు పట్టే విషయంలో.. ఎంతటి కష్టమైన క్యాచ్ నైనా సరే కళ్లుమూసుకుని పట్టేస్తా అన్నట్లు బిల్డప్ ఇచ్చే రియాన్ పరాగ్.. రాయల్ చాలెంజ్స్ బెంగళూరు (Royal Challengers bangalore)తో జరిగిన మ్యాచ్ లో ఈజీ క్యాచ్ ను మిస్ చేసి ట్రోలర్స్ కు దొరికిపోయాడు. క్రికెట్ లో క్యాచ్ లను మిస్ చేయడం సహజమే.. కానీ రియాన్ పరాగ్ గతంలో చేసిన ఓవరాక్షన్ వల్ల ’నువ్వు క్యాచ్ ను మిస్ చేయకపోతావా మేం చూడకపోతామా‘ అనే ధోరణిలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. క్వాలిఫయర్ 2లో భాగంగా రజత్ పటిదార్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రియాన్ పరాగ్ మిస్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ జట్టు ఫ్యాన్స్ పరాగ్ ను ఉతికి ఆరేసేవారు.





ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే బౌండరీ లైన్ దగ్గర బ్యాకప్ కు రాలేదని దేవ్ దత్ పడిక్కల్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అదే మ్యాచ్ లో రాజస్తాన్ బ్యాటింగ్ చేసే సమయంలో అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించలేదని అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఇక క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొంది ఫైనల్లో ప్రవేశించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sanju Samson, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు