Home /News /sports /

IPL 2022 CRICKET FANS PRAISE VIRAT KOHLI FOR HIS SPIRIT OF CRICKET GESTURE AGAINST RAJASTHAN ROYALS SJN

Virat Kohli : ఇందుకే కదా.. విరాట్ కోహ్లీని గ్రేట్ అనేది.. టీమిండియా స్టార్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

Virat Kohli

Virat Kohli

Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) పెద్దగా ఆడలేకపోయాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ ల్లోను దారుణంగా విఫలమయ్యాడు.

Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) పెద్దగా ఆడలేకపోయాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ ల్లోను దారుణంగా విఫలమయ్యాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. అతడితో పాటు మిగిలిన ప్లేయర్స్ కూడా విఫలం కావడంతో రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది. అయితే రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ పెద్దగా ఆడకపోయినప్పటికీ.. అతడి క్రీడాస్ఫూర్తి అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేస్తోంది.

ఇది కూడా చదవండి : బిల్డప్ బాబాయ్ కాస్ట్ లీ మిస్టేక్.. ఫ్యాన్స్ చేతిలో దారుణంగా ట్రోల్..

బౌల్ట్ వేసిన తొలి ఓవర్ లో డీప్ మిడ్ వికెట్ దిశగా కోహ్లీ ఫ్లిక్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జాస్ బట్లర్ డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు త్రో చేశాడు. అయితే అప్పటికే కోహ్లీ క్రీజులోకి చేరగా.. బంతి అతడిని తాకుతూ ఫీల్డర్ లేని వైపుకు వెళ్లింది. అయితే కోహ్లీ మాత్రం మరోసారి పరుగు తీసేందుకు ప్రయత్నం చేయలేదు. రూల్స్ ప్రకారం ఫీల్డర్ విసిరిన బంతి బ్యాటర్ బ్యాట్ లేదా బాడీకి తగిలి వెళ్లినట్లయితే మరోసారి పరుగు తీయరాదు. ఇక్కడ కూడా అదే జరగ్గా.. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న డు ప్లెసిస్ అదనపు పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే కోహ్లీ మాత్రం బంతి తనకు తగిలినట్లు.. పరుగు వద్దంటూ వారించాడు. ఇప్పుడు ఇదే కోహ్లీని పొగిడేలా చేస్తోంది.







బౌల్ట్ బౌలింగ్ లో సిక్సర్ బాదిన కోహ్లీ.. టచ్ లో ఉన్నట్లు కనిపించాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే ప్రసిధ్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని వెంటాడి మరీ పెవలియన్ కు చేరాడు. ఇక మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (42 బంతుల్లో 58 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (13 బంతుల్లో 24 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు.  అనంతరం రాజస్తాన్ రాయల్స్  18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. జోస్ బట్లర్ ( 60 బంతుల్లో 106 పరుగులు నాటౌట్ ; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో సారి తన ఫామ్ కంటిన్యూ చేస్తూ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Rajasthan Royals, Royal Challengers Bangalore, Virat kohli

తదుపరి వార్తలు