హోమ్ /వార్తలు /క్రీడలు /

Gautam Gambhir : ఏంది గౌతీ భాయ్ ఇది.. చూస్తుంటే రాహుల్ ని కంటి చూపుతోనే..

Gautam Gambhir : ఏంది గౌతీ భాయ్ ఇది.. చూస్తుంటే రాహుల్ ని కంటి చూపుతోనే..

గంభీర్, కేఎల్ రాహుల్ (PC : TWITTER)

గంభీర్, కేఎల్ రాహుల్ (PC : TWITTER)

Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్ తో ముగిసిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore)తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 14 పరుగులతో ఓడి ఇంటి దారి పట్టింది.

ఇంకా చదవండి ...

Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) ప్రస్థానం ఎలిమినేటర్ మ్యాచ్ తో ముగిసిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore)తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 14 పరుగులతో ఓడి ఇంటి దారి పట్టింది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో ప్లేయర్స్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. జట్టును ముందుండి నడపాల్సిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL rahul) కీలకమైన దినేశ్ కార్తీక్ () వికెట్ ను నేలపాలు చేశాడు. ఆ తర్వాత మరికొన్ని ఈజీ క్యాచ్ లు కూడా నేలపాలు అయ్యాయి. ఫలితంగా ఆర్సీబీ చేతిలో లక్నో జట్టు ఓడింది.

ఇది కూడా చదవండి : ఆర్సీబీ కోసం ప్రాణం పెడుతోన్న ప్లేయర్స్.. ఆ బౌలర్ అయితే ఏకంగా కుట్లతోనే బౌలింగ్..

మ్యాచ్ అనంతరం లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ (gautam Gambhir) లక్నో ఆటగాళ్లపై ఆగ్రహం ప్రదర్శించాడు. కేఎల్ రాహుల్ ను కోపంతో చూస్తోన్న పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో కేఎల్ రాహుల్ ను సమర్ధిస్తుంటే మరికొందరు గంభీర్ కోపంలో న్యాయం ఉందంటూ గౌతీకి సపోర్ట్ చేస్తున్నారు.

ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ ( 54 బంతుల్లో 112 పరుగులు ; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఈ సీజన్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో దినేష్ కార్తీక్ (23 బంతుల్లో 37 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించాడు. మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, ఆవేశ్ ఖాన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం  లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 79 పరుగులు ; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాటం వృధా అయింది. దీపక్ హుడా (26 బంతుల్లో 45 పరుగులు; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు.

First published:

Tags: Gautam Gambhir, IPL, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, RCB, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు