హోమ్ /వార్తలు /క్రీడలు /

Sunil Gavaskar : అప్పుడు కోహ్లీ భార్య విషయంలో.. ఇప్పుడు హెట్ మైర్ సతీమణి విషయంలో.. మళ్లీ నోరు జారిన గావస్కర్

Sunil Gavaskar : అప్పుడు కోహ్లీ భార్య విషయంలో.. ఇప్పుడు హెట్ మైర్ సతీమణి విషయంలో.. మళ్లీ నోరు జారిన గావస్కర్

సునీల్ గావస్కర్ (ఫైల్ ఫోటో)

సునీల్ గావస్కర్ (ఫైల్ ఫోటో)

Sunil Gavaskar : క్రికెట్ దిగ్గజం.. భారత లెజండరీ ప్లేయర్.. స్టార్ కామెంటేటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మరోసారి నోరు జారాడు. చెత్త వ్యాఖ్యానంతో ఫ్యాన్స్ చేత చివాట్లు తింటున్నాడు.

Sunil Gavaskar : క్రికెట్ దిగ్గజం.. భారత లెజండరీ ప్లేయర్.. స్టార్ కామెంటేటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మరోసారి నోరు జారాడు. చెత్త వ్యాఖ్యానంతో ఫ్యాన్స్ చేత చివాట్లు తింటున్నాడు. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాజస్తాన్ రాయల్స్ (Rajstahan Royals) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సునీల్ గావస్కర్ మహిళల పట్ల నోరు జార విమర్శల పాలౌతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రన్ హెట్ మైర్ భార్య విషయంలో అతడు చేసిన కామెంట్ ఇప్పుడు క్రికెట్ సర్కిల్ లో తీవ్ర చర్చకు దారిసింది. వయసు పెరిగినా బుద్ధి పెరగలేదంటూ క్రికెట్ లవర్స్ చేతిలో గావస్కర్ తిట్లు తింటున్నాడు.

షిమ్రన్ హెట్ మైర్ భార్య ఇటీవలె పండంటి బిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అతడు పెటర్నీ లీవ్ తీసుకుని తన దేశానికి వెళ్లి కూడా వచ్చాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో రాజస్తాన్ ప్లేయర్ హెట్ మైర్ బ్యాటింగ్ కు వచ్చాడు. అదే సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న గావస్కర్.. హెట్ మైర్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ’కొన్ని రోజుల క్రితమే హెట్ మైర్ సతీమణి డెలివరీ అయ్యింది. మరీ అతడు ఈ రోజు మ్యాచ్ లో రాజస్తాన్ కు డెలివరీ చేయగలడా‘ అంటూ వ్యాఖ్యానం చేశాడు.

మహిళల డెలివరీ విషయంలో గావస్కర్ ఆ విధంగా కామెంట్స్ చేయకూడదంటూ కొందరు ఫ్యాన్స్ గావస్కర్ కు హితవు పలుకుతోండగా.. మరికొందరేమో గడ్డి పెడుతున్నారు. అసలు గావస్కర్ కు కామెంటరీ ప్యానెల్ లో ఉండేందుకు అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలోనూ విరాట్ కోహ్లీ విషయంలో అతడి భార్య అనుష్క శర్మ ప్రస్థావనను తీసుకొచ్చి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన గురించి వివరిస్తూ.. లాక్ డౌన్ లో ప్రాక్టీస్  చేసుకోవడానికి సరైన సదుపాయాలు లేక అనుష్క బంతులతో కోహ్లీ ప్రాక్టీస్ చేశాడంటూ జుగుప్సా కరమైన కామెంట్స్ చేశాడు. అప్పట్లో ఇవి తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ క్రమంలో గావస్కర్ కు అనుష్క శర్మ సైతం సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెట్టింది కూడా.

First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson, Sunil Gavaskar

ఉత్తమ కథలు