IPL 2022 CRICKET FANS ANGRY ON LUCKNOW SUPERGIANTS ALL ROUNDER KRUNAL PANDYA FOR WORST BEHAVIOUR TOWARDS KIERON POLLARD AND PARTHIV PATEL ALSO SLAMS KRUNAL PANDYA SJN
IPL 2022: ఈ కృనాల్ పాండ్యా ఓవర్ యాక్షన్ భరించలేకున్నాం రా బాబు..! మైదానంలో ఆ ముద్దులేంటిరా..
కృనాల్ పాండ్యా, పొలార్డ్ (PC : TWITTER)
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓటములనైనా భరించొచ్చేమో కానీ, ఈ పాండ్యా బ్రదర్స్ ఓవరాక్షన్ ను మాత్రం క్రికెట్ లవర్స్ అస్సలు భరించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న క్యాచ్ ను పట్టడానికి ప్రయత్నించలేదని టీమిండియా (Team India) సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (mohammed shami)పైనే హార్దిక్ పాండ్యా చిందులేశాడు.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓటములనైనా భరించొచ్చేమో కానీ, ఈ పాండ్యా బ్రదర్స్ ఓవరాక్షన్ ను మాత్రం క్రికెట్ లవర్స్ అస్సలు భరించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న క్యాచ్ ను పట్టడానికి ప్రయత్నించలేదని టీమిండియా (Team India) సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (mohammed shami)పైనే హార్దిక్ పాండ్యా చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు హార్దిక్ పై భగ్గుమన్నారు. తాజాగా అతడి అన్న కృనాల్ పాండ్యా చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. చూస్తేనే కంపరము వచ్చేలా ఉంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో ఆదివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో పొలార్డ్ వికెట్ తీసిన తర్వాత కృనాల్ పాండ్యా ముద్దులతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఛేదనలో కీరన్ పోలార్డ్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై గెలవాలంటే చివరి ఓవర్లో 38 పరుగులు చేయాల్సి ఉండగా లక్నో సారథి రాహుల్ బంతిని కృనాల్ పాండ్యాకు ఇచ్చాడు. అతడు తొలి బంతికే పొలార్డ్ వికెట్ ను రాబట్టాడు. పాపం పొలార్డ్ తన మానాన తను పెవిలియన్ కు వెళ్తుంటే.. వెనుక నుంచి వచ్చిన కృనాల్ పాండ్యా పొలార్డ్ భుజంపైకి ఎగిరి అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. వీరిద్దరు ఎంత మంచి స్నేహితులైనా అయ్యి ఉండొచ్చు.. కానీ, నిన్న జరిగిన మ్యాచ్ లో వీరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. అందులోనూ పొలార్డ్ తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. బాధతో పెవిలియన్ కు వెళ్తున్నాడు. అలాంటి స్థితిలో కృనాల్ పాండ్యా వెకిలి చేష్టలు అందరి చేత చివాట్లు తినేలా చేస్తున్నాయి.
Krunal Pandya is Very Pollord Inner
Lucky That Pollard Feeling
Control his Feeling
అవుటైన వ్యక్తి మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరుపై భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఘాటుగా స్పందించాడు. టూ మచ్ అంటూకృనాల్ పాండ్యా ఓవరాక్షన్ పై స్పందించాడు. ఇక క్రికెట్ లవర్స్ అయితే కృనాల్ పాండ్యాను ఒక ఆట ఆడుకుంటున్నారు. కృనాల్ పాండ్యాను పొలార్డ్ ఒక గుద్దు గుద్దిండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కృనాల్ పాండ్యాకు పొలార్డ్ లాంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు అతడు ఏం చేస్తోడో చూడాలని ఉందంటూ మరొకరు కామెంట్ పెట్టారు.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పేక మేడలా మరోసారి కుప్పకూలింది. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేదు. దాంతో సీజన్ లో రోహిత్ సేన ఎనిమిదో ఓటమిని నమోదు చేసుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.