Home /News /sports /

IPL 2022 CHENNAI SUPER KINGS STAR PACER DEEPAK CHAR SET TO MARRY HIS GIRL FRIEND JAYA BARADWAJ ON 1ST JUNE SJN

Deepak Chahar wedding : ప్రేయసిని పెళ్లాడనున్న చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్.. ఎప్పుడంటే?

దీపక్ చహర్ (PC : INSTAGRAM)

దీపక్ చహర్ (PC : INSTAGRAM)

Deepak Chahar wedding : టీమిండియా (Team India)కు చెందిన మరో స్టార్ ప్లేయర్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.  భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బౌలర్ దీపక్ చహర్ (Deepak Chahar) తన ప్రేయసి జయ భరద్వాజ్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఇంకా చదవండి ...
Deepak Chahar wedding : టీమిండియా (Team India)కు చెందిన మరో స్టార్ ప్లేయర్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.  భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బౌలర్ దీపక్ చహర్ (Deepak Chahar) తన ప్రేయసి జయ భరద్వాజ్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో అంచెలో దీపక్ చహర్.. తన ప్రేయసి జయకు ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ ఈ ఏడాది జూన్ 1వ తేదీన వీరిద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. దీనికి సంబందించిన పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి  : మ్యాచ్ ను కవరేజ్ చేయమంటే.. ఈ కెమెరామెన్ ఏం చేస్తున్నాడో చూడండి! (వీడియో)

ఇక ఈ ఏడాది దీపక్ చహర్ గాయంతో ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఫిబ్రవరి నెలలో జరిగిన వేలంలో దీపక్ చహర్ ను రూ. 14 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వెస్టిండీస్ తో అదే నెలలో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో పాల్గొన్నాడు. దాంతో ఈ ఐపీఎల్ రెండో అర్ధ భాగానికి అతడు జట్టుతో కోరతాడని అంతా అనుకున్నారు. అయితే పునరావాసంలో అతడు మరోసారి గాయపడంతో ఐపీఎల్ తో పాటు మరికొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు.



ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ ప్రపంచకప్ సమయం నాటికి కోలుకునేలా దీపక్ చహర్ ప్రస్తుతం రెడీ అవుతున్నాడు. దాంతో ప్రస్తుతం అతడు రెస్ట్ లోనే ఉన్నాడు. ఈ క్రమంలో అతడు తన ప్రేయసిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమమయ్యాడు. మళ్లీ క్రికెట్ ఆడటం మొదలు పెడితే క్రికెట్ తో బిజీ బిజీగా గడిపే అవకాశం ఉంది. అలాంటి సమయంలో అతడు బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకునే అవకాశం కష్టం. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. అందుకే గాయం వల్ల కలిసొచ్చిన బ్రేక్ లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమమయ్యాడు. దీనికి సంబంధించిన పెళ్లి పత్రికను కూడా ఇప్పటికే ప్రింట్ చేయగా.. అది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Marriage, MS Dhoni

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు