టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మైదానంలోనే కాదు బయట కూడా ఆల్ రౌండర్ అనే విధంగా మరో కళను బయటపెట్టాడు. రవీంద్రుడి కత్తిసాము గురించి తెలియని వారుండరు. రాజ వంశానికి చెందిన ఈ సౌరాష్ట్ర క్రికెటర్ హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన సందర్భాల్లో కానీ.. ఏమైనా అరుదైన ఘనతల్ని సాధించినప్పుడు కానీ బ్యాట్‌తో కత్తిసాము చేయడం పరిపాటి. అలాంటి జడ్డూ ఇప్పుడు తనలో ఉన్న మరో కళను బయట పెట్టాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు.. రికవరీ సెషన్లో సరదాగా గడిపిన చెన్నై ప్లేయర్లు.. జడ్డూ ట్యాలెంట్ చూసి అవాక్కయ్యారు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన తర్వాత మ్యాచ్‌లో తలపడనున్న సీఎస్కే ఆటగాళ్లు.. రికవరీ సెషన్లో భాగంగా సరదాగా బాస్కెట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన జడ్డూ.. తన బాస్కెట్‌బాల్ నైపుణ్యంతో వారెవ్వా అన్పించాడు.
చూడకుండా బాల్‌ను షూట్ చేసే ముందు.. జడేజా చేసిన పలు ప్రయత్నాలు అలరిస్తున్నాయి. ఇక పర్ఫెక్ట్గా బాల్‌ను చూడకుండానే షూట్ చేయడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ వీడియోకు ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. "జడ్డూ ఏదైనా చేయగలడు.." "అందుకే కదా.. సర్ జడేజా అనేది" అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. అయితే "ముందు కనీసం మ్యాచ్ గెలవండి అంటూ" చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
— Ravindrasinh jadeja (@imjadeja) April 7, 2022
బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. మైదానంలో కూడా పాదరసంలా కదులుతూ ప్రపంచస్థాయి ఫీల్డర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగిన జడేజా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తాడు. రవీంద్ర జడేజా .. తొలి సారి ఐపీఎల్ (IPL) లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
లీగ్ ఆరంభానికి ముందుధోని(MS Dhoni) అనుహ్య నిర్ణయంతో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కు కెప్టెన్ అయ్యాడు. అయితే, జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ హ్యాట్రిక్ పరాజయాల్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై.. అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక, శనివారం ఆరెంజ్ ఆర్మీతో జరిగే మ్యాచులో గెలిచి ఈ సీజన్ లో బోణి కొట్టాలని భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.