Home /News /sports /

IPL 2022 CHENNAI SUPER KINGS CAPTAIN RAVINDRA JADEJA DROPPED TWO CATCHES AGAINST MUMBAI INDIANS SJN

IPL 2022: జడేజాకు అసలేమైంది.. ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు.. మరీ ఇంత ఘోరమా..

క్యాచ్ ను మిస్ చేస్తున్న జడేజా (PC: TWITTER)

క్యాచ్ ను మిస్ చేస్తున్న జడేజా (PC: TWITTER)

IPL 2022: ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ఫీల్డర్లలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒకరు. యువరాజ్ సింగ్ (Yuvraj singh), మొహమ్మద్ కైఫ్ (mohammad kaif), సురేశ్ రైనా (Suresh Raina)ల తర్వాత టీమిండియా (Team India)కు దొరికిన మరో నిఖార్సైన ఫీల్డర్ రవీంద్ర జడేజా.

ఇంకా చదవండి ...
IPL 2022: ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ ఫీల్డర్లలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒకరు. యువరాజ్ సింగ్ (Yuvraj singh), మొహమ్మద్ కైఫ్ (mohammad kaif), సురేశ్ రైనా (Suresh Raina)ల తర్వాత టీమిండియా (Team India)కు దొరికిన మరో నిఖార్సైన ఫీల్డర్ రవీంద్ర జడేజా. కష్టసాధ్యమైన క్యాచ్ లను పట్టడంతో పాటు తన పవర్ ఫుల్ ఆర్మ్ తో వికెట్లను నేరుగా గిరాటేస్తూ రనౌట్లు చేయడంలో రవీంద్ర జడేజా ముందుంటాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా పేలవ ఫీల్డింగ్ తో అందరినీ ఆశ్యర్యపరిచాడు. అసలు జడేజాకు ఏమైంది.. అని ఫ్యాన్స్ అనేంతలా చెత్త ఫీల్డింగ్ తో నిరాశ పరిచాడు.

ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది కాబట్టి.. జడేజా ఫీల్డింగ్ పై ఎటువంటి దుమారం రేగలేదు. ఒక వేళ ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింటే.. జడేజా ఫీల్డింగ్ ను చీల్చి చెండాడే వారు. మ్యాచ్ లో జడేజా ఏకంగా రెండు క్యాచ్ లను జారవిడిచాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసే సమయంలో డివాల్డ్ బ్రేవిస్ భారీ షాట్ ఆడగా.. బ్యాట్ అంచుకు తగిలి కవర్స్ లో చాలా ఎత్తుకు వెళ్లింది. అక్కడే ఉన్న జడేజా వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. జడేజా లాంటి ఫీల్డర్ కు ఇదేమీ కష్టమైన క్యాచ్ అయితే కాదు. కానీ, బంతి గమనాన్ని తప్పుగా జడ్జ్ చేసిన రవీంద్రుడు క్యాచ్ ను జార విడిచాడు.



ఇక మ్యాచ్ లో మరోసారి కూడా రవీంద్ర జడేజా క్యాచ్ ను డ్రాప్ చేశాడు. హృతిక్ షోకీన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను రవీంద్ర జడేజా జారవిడిచాడు. బ్రెవీస్ క్యాచ్ తో పోలిస్తే ఇది చాలా ఈజీ క్యాచ్. అయినా కూడా జడేజా ఈ క్యాచ్ ను మిస్ చేశాడు. నిన్నటి మ్యాచ్ ను గనుక చూస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపిస్తుంది. జడేజా రెండు క్యాచ్ లు మిస్ చేయగా.. బ్రావో ఒకటి, శివమ్ దూబే మరో క్యాచ్ ను నేలపాలు చేశారు. హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ 2 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను బ్రావో స్లిప్ లో మిస్ చేశాడు. అనంతరం అతడు అర్ధ సెంచరీ సాధించాడు. ఇక ధోని కూడా సూర్య కుమార్ యాదవ్ స్టంపింగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకోవడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Ravindra Jadeja, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు