IPL 2022 CHENNAI SUPER KINGS BOWLER MATHEESHA PATHIRANA TAKES HIS MAIDEN IPL WICKET FOR THE FIRST BALL OF HIS DEBUT MATCH AGAINST GUJARAT TITANS SJN
matheesha pathirana : వామ్మో..ఈ కుర్రాడి బౌలింగ్ యాక్షన్ మలింగ కంటే డేంజర్ గా ఉందే..? పాపం గిల్ బొక్క బోర్లా పడ్డాడు..
matheesha pathirana (PC : TWITTER)
matheesha pathirana : ప్రపంచ క్రికెట్ ను బెంబేలెత్తించడానికి మరో సీమర్ రెడీ అయ్యాడు.దిగ్గజ పేసర్ లసిత్ మలింగ (Lasit Malinga) బౌలింగ్ యాక్షన్ ను పోలిన బౌలింగ్ తో బ్యాటర్స్ ను భయపెట్టడానికి శ్రీలంకకే చెందిన మతీశ పతిరణ సిద్ధం అయ్యాడు.
matheesha pathirana : ప్రపంచ క్రికెట్ ను బెంబేలెత్తించడానికి మరో సీమర్ రెడీ అయ్యాడు.దిగ్గజ పేసర్ లసిత్ మలింగ (Lasit Malinga) బౌలింగ్ యాక్షన్ ను పోలిన బౌలింగ్ తో బ్యాటర్స్ ను భయపెట్టడానికి శ్రీలంకకే చెందిన మతీశ పతిరణ సిద్ధం అయ్యాడు. అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన పతిరణ.. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆదివారం అరంగేట్రం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లేయర్ ఆడమ్ మిల్నే గాయంతో తప్పుకోవడంతో.. అతడి స్థానంలో పతిరణను ధోని టీం తీసుకుంది. మొన్నటి వరకు బెంచ్ కే పరిమితం అయిన అతడు.. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ తో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన ఈ జూనియర్ మలింగ తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు. ఐపీఎల్ లో వేసిన తొలి బంతికే గుజరాత్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ వికెట్ ను తీసి అదరగొట్టాడు. పతిరణ బౌలింగ్ యాక్షన్ ను అర్థం చేసుకోవడంలో విఫలం అయిన గిల్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఎల్బీ అంటూ అవుట్ ఇచ్చినా.. అతి విశ్వాసంతో రివ్యూకు వెళ్లిన గిల్ కు చివరకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇక పతిరణ బౌలింగ్ యాక్షన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ధోని కూడా పతిరణ బౌలింగ్ ను మెచ్చుకోవడం విశేషం.
పతిరణ బౌలింగ్ యాక్షన్ మలింగ కంటే కూడా డేంజర్ లా కనిపిస్తోంది. మలింగ రౌండార్మ్ తో బౌలింగ్ చేసేవాడని మనందరికీ తెలిసిన విషయమే. పతిరణ కూడా మలింగ లాగే రౌండార్మ్ యాక్షన్ తో బంతులను వేస్తున్నాడు. అయితే మలింగ కంటే కంటే కూడా తక్కువ ఎత్తు నుంచి పతిరణ బంతిని విసురుతున్నాడు. దాంతో బ్యాటర్స్ అతడి బంతులను ఆడేందుకు ఇబ్బంది పడటం ఖాయంలా కనిపిస్తోంది. మలింగ యార్కర్ లతో అదరగొడితే.. పతిరణ స్లో బాల్స్ వేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ధోని సైతం భవిష్యత్తులో పతిరణ ఒక మంచి డెత్ ఓవర్ స్పెషలిస్టు అవతాడని పేర్కొనడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.