Home /News /sports /

IPL 2022 CHENNAI SUPER KINGS BATTER MOEEN ALI HITS 6 4 4 4 4 4 IN TRENT BOULT OVER AGAINST RAJASTHAN ROYALS SJN

Moeen Ali : 6, 4, 4, 4, 4 ,4.. పాపం బౌల్ట్ బిత్తర చూపులు.. అందుకే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది

మొయిన్ అలీ (PC : IPL)

మొయిన్ అలీ (PC : IPL)

Moeen Ali : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో శుక్రవారం అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో మొయిన్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే.

Moeen Ali : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో శుక్రవారం అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో మొయిన్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన మొయిలీ 57 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు , 3 సిక్సర్లు ఉండటం విశేషం. అయితే మొయిన్ అలీ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మొయిన్ అలీని రీటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు మొయిన్ అలీ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరచలేకపోయాడు. అయితే తాజాగా అతడు తన బ్యాట్ తో చెలరేగిపోయాడు.

ఇది కూడా చదవండి  : సోదరుడిపై ప్రేమ ఎంత పని చేయించింది.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై పీసీబీ సీరియస్.. కెప్టెన్సీపై వేటు తప్పదా?

చెన్నై బ్యాటింగ్ చేస్తోండగా.. 6వ ఓవర్ వేయడానికి ట్రెంట్ బౌల్ట్ వచ్చాడు. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న మొయిన్ అలీ వరుసగా 6, 4, 4, 4, 4, 4 కొట్టి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. టి20 ఫార్మాట్ లో ఇటువంటివి చోటు చేసుకోవడం సహజమే. అయితే టాప్ బౌలర్ బౌలింగ్ లో ఇలా కొట్టడం చాలా అరుదు. మొయిన్ అలీ కొడుతుంటే బౌల్ట్ బిత్తర చూపులు చూడటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాడు. మొయిన్ అలీ విన్యాసాలు చూడాలంటే కింది లింక్ ను క్లిక్ చేయండి.

మొయిన్ అలీ అద్భుత విన్యానసం : 6, 4, 4, 4, 4, 4 (వీడియో)



మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్ తో చెలరేగిపోయినా.. అతడికి ఇతర ప్లేయర్స్ నుంచి సహకారం కొరవడింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలుపొందింది. . రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59 పరుగులు ; 8 ఫోర్లు, 1 సిక్సర్), రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 40 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకి రెండు వికెట్లతో సత్తా చాటాడు. సిమర్ జీత్, మొయిన్ అలీ, మిచెల్ శాంట్నర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలో​కి దిగిన రాజస్తాన్‌ రాయల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చే
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, Csk, IPL, IPL 2022, MS Dhoni, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు