Home /News /sports /

IPL 2022 CAN INDIA TAKE REVENGE FOR 2017 FINAL DEFEAT BY WINNING TOMORROW SJN

women world cup: 2017 ఫైనల్ కు భారత్ ప్రతీకారం తీర్చుకునేనా..? రేపు ఇంగ్లండ్ తో టఫ్ ఫైట్

టీమిండియా మహిళల జట్టు

టీమిండియా మహిళల జట్టు

women world cup: మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత జట్టుకు రేపు కఠిన పరీక్ష ఎదురుకానుంది. రేపు జరిగే లీగ్ మ్యాచ్ లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో అమీతుమీకి సిద్ధమైంది. మిథాలీ రాజ్ నాయకత్వంలోని టీమిండియా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఒక దాంట్లో ఓడింది.

ఇంకా చదవండి ...
women world cup: మహిళల వన్డే ప్రపంచకప్ (World cup)లో భారత (India) జట్టుకు రేపు కఠిన పరీక్ష ఎదురుకానుంది. రేపు జరిగే లీగ్ మ్యాచ్ లో టీమిండియా (Team India) డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England)తో అమీతుమీకి సిద్ధమైంది. మిథాలీ రాజ్ (Mithali Raj) నాయకత్వంలోని టీమిండియా టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఒక దాంట్లో ఓడింది. వెస్టిండీస్ (West Indies)తో జరిగిన చివరి మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 155 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్... రేపు 2017 ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లండ్ తో తాడో పేడో తేల్చుకోనుంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాపై ఇంగ్లండ్ గెలిచి చాంపియన్ గా నిలిచింది. రేపు జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గెలిచి ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

మరోవైపు డిఫెండింగ్ హోదాలో ప్రపంచకప్ లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ కు ఏదీ కలిసి రావడం లేదు. తొలుత ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిన ఆ జట్టు... అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా చేతిలో ఊహించని విధంగా ఓడింది. రేపు భారత్ తో జరిగే మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ ఓడిపోతే ఇక ప్రపంచకప్ ఆశలు గల్లంతైనట్లే. ఆ జట్టు తరఫున నాట్ స్కీవర్ మాత్రమే ఆడుతుంది. మిగిలిన ప్లేయర్స్ ఆడాల్సి ఉంది.

ఇక టీమిండియా మాత్రం వెస్టిండీస్ పై విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. ముఖ్యంగా ఆ మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (smriti mandhana), వైస్ కెప్టెన్ హర్మన్  ప్రీత్ కౌర్ (harman preet kaur) సెంచరీలతో కదం తొక్కారు. వీరు సూపర్ ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. అయితే సారథి మిథాలీ రాజ్ ఫామ్ కలవర పెడుతోంది. ఆమె పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడుతోంది. రేపు జరిగే మ్యాచ్ లో మిథాలీ రాజ్ కూడా తన బ్యాట్ తో రాణిస్తే ఇక భారత్ కు తిరుగుండదు. రేపు జరిగే మ్యాచ్ లో మాత్రం ఇంగ్లండ్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుండగా... భారత్ డార్క్ హార్స్ గా బరిలోకి దిగుతుంది.

భయపెడుతోన్న ముఖాముఖీ రికార్డు

టీమిండియాను ముఖాముఖీ రికార్డు భయపెడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 24 వన్డేలు జరగ్గా... 17 మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ గెలిచింది. భారత్ మాత్రం కేవలం 5 మ్యాచ్ ల్లో నెగ్గింది. మిగిలిన రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ప్రపంచకప్ లో ఆ రెండు జట్లు చివరి సారిగా 2017 ఫైనల్లో తలపడగా... భారత్ ఆ మ్యాచ్ లో ఓడిపోయింది.

తుది జట్ల అంచనా

టీమిండియా; మంధాన, యస్తిక భాటియా, దీప్తి శర్మ, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కైర్, రిచా ఘోష్,  స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, జులన్ గోస్వామి, మేఘ్నా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్

ఇంగ్లండ్; ట్యామీ బీమౌంట్, వ్యాట్, హీథర్ నైట్, నటాలీ స్కీవర్, అమీ జోన్స్, సోఫియా డంక్లీ, కేథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, సోఫీ ఎక్సెల్ స్టోన్, చార్లీ డీన్, అనీ ష్రుబ్ సోల్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, India, India vs england, Mithali Raj, Smriti Mandhana, Team India, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు