Home /News /sports /

IPL 2022 CAMERAMAN COVERS BEAUTIFUL GIRLS IN STADIUM WITH HIS CAMERA CAUGHT ON VIDEO GOES VIRAL SJN

IPL 2022 : మ్యాచ్ ను కవరేజ్ చేయమంటే.. ఈ కెమెరామెన్ ఏం చేస్తున్నాడో చూడండి! (వీడియో)

కెమెరామెన్ (PC : TWITTER)

కెమెరామెన్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఈసారి ఆటకంటే కూడా వేరే అంశాలు పాపులర్ అయిన సంగతి తెలిసిందే. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), రిషభ్ పంత్ (Rishabh Pant), శ్రేయస్ అయ్యర్ (Shreyas ) బ్యాట్ లు ఈ సీజన్ లో మూగబోగా.. ఎవరూ ఊహించని విధంగా జాస్ బట్లర్ (Jos Buttler) రెచ్చిపోయాడు.

ఇంకా చదవండి ...
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఈసారి ఆటకంటే కూడా వేరే అంశాలు పాపులర్ అయిన సంగతి తెలిసిందే. భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), రిషభ్ పంత్ (Rishabh Pant), శ్రేయస్ అయ్యర్ (Shreyas ) బ్యాట్ లు ఈ సీజన్ లో మూగబోగా.. ఎవరూ ఊహించని విధంగా జాస్ బట్లర్ (Jos Buttler) రెచ్చిపోయాడు. ఇక ఈ సీజన్ లో ఆటగాళ్ల కంటే కూడా అంపైర్లు ఎక్కువగా పాపులర్ అయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో ప్రతి రోజు పతాక శీర్షికల్లో నిలిచారు. ఇక మైదానంలో లైవ్ కవరేజ్ చేసే కెమెరామెన్ లు ఆట కంటే కూడా మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చే వారిలో అందమైన అమ్మాయిలను పట్టుకొనేందుకు పని చేసినట్లు కనిపించారు.

ఇది కూడా చదవండి  : ఇంతకీ విరాట్ కోహ్లీ ఎవరిని హెల్ప్ అడిగినట్లు.. రోహిత్ నా లేక పంత్ నా? ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఫైర్

ఇక శనివారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే .ఈ మ్యాచ్ లో ముంబై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఇక మ్యాచ్ మధ్యలో ఒక కెమెరామెన్ ఆటను కవరేజ్ చేయకుండా అమ్మాయిలను కవరేజ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్స్ క చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ  20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. రొవెమన్ పావెల్ (34 బంతుల్లో 43 పరుగులు ; 1 ఫోర్, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (33 బంతుల్లో 39 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో దుమ్మురేపాడు. తన అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ జోరుకు బ్రేకులు వేశాడు. రమణ్ దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సామ్స్, మార్కండే చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ముంబై 19.1 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48 పరుగులు ; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ (33 బంతుల్లో 37 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34 పరుగులు ; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ ( 17 బంతుల్లో 21 పరుగులు ; 1 ఫోర్, 1సిక్సర్) మెరుపులు మెరిపించడంతో ఈ సీజన్ ను ముంబై సూపర్ విక్టరీతో ముగించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: David Warner, IPL, IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు