IPL 2022 BOLLYWOOD SUPER STAR RANVEER SINGH WILD CELEBRATIONS AFTER MUMBAI INDIANS VIDEO GOES VIRAL ON TWITTER SJN
Ranveer Singh : అందుకే నిన్ను ఓవరాక్షన్ కా బాప్ అనేది.. బ్రబోర్న్ స్టేడియంలో రణ్ వీర్ సింగ్ వీరంగం..
రణ్ వీర్ సింగ్ (PC : TWITTER)
Ranveer Singh : విచిత్రమైన వేషధారణకు మారుపేరు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ (Ranveer singh). చిత్ర విచిత్రమైన డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ తో నిత్యం వార్తల్లో ఉండే ఈ బాలీవుడ్ కండల వీరుడు.. తాజాగా క్రికెట్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల రణ్ వీర్ క్రికెట్ దిగ్గజం ప్రపంచకప్ సారథి కపిల్ దేవ్ పాత్రలో నటించిన 83 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Ranveer Singh : విచిత్రమైన వేషధారణకు మారుపేరు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ (Ranveer singh). చిత్ర విచిత్రమైన డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ తో నిత్యం వార్తల్లో ఉండే ఈ బాలీవుడ్ కండల వీరుడు.. తాజాగా క్రికెట్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల రణ్ వీర్ క్రికెట్ దిగ్గజం ప్రపంచకప్ సారథి కపిల్ దేవ్ పాత్రలో నటించిన 83 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ చేత శభాష్ కూడా అనిపించుకుంది. ఇక శుక్రవారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య బ్రబోర్న్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి రణ్ వీర్ సింగ్ స్టేడియానికి వెళ్లాడు. మ్యాచ్ పూర్తయ్యేవరకు ముంబై ఇండియన్స్... ముంబై ఇండియన్స్ అంటూ ఊగిపోయాడు. ముందే మనోడు బాలీవుడ్ స్టార్.. అంతేకాకుండా ఓవరాక్షన్ కా బాప్ కూడా. ఇక కెమెరా కళ్లన్నీ మనోడి మీదే ఫోకస్ చేశాయి. బంతికి బంతికి మధ్య గ్యాప్ దొరికితే చాలు మన ఇంట్లోని టీవీ తెరల్లో రణ్ వీర్ ప్రత్యక్షమైపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సిక్సర్ కొడితే వైల్డ్ రియాక్షన్స్ తో రెచ్చిపోయాడు. ఇక కెప్టెన్లకు డీఆర్ ఎస్ తీసుకో అంటూ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సైగలు చేస్తూ కెప్టెన్ లా మారిపోయాడు. అంటే ఇటీవల అతడు 83 మూవీలో నటించాడు కదా.. ఇంకా కపిల్ దేవ్ పాత్రలోనే ఉన్నట్లు ఉన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత రణ్ వీర్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. కమాన్ కమాన్ అంటూ రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
కొంత మంది అభిమానులు అయితే రణ్ వీర్ ఓవరాక్షన్ పై తమదైన శైలిలో పంచులు వేశారు. క్రెడ్ యాప్ యాడ్ తో రణ్ వీర్ ను కంపేర్ చేస్తూ జోక్స్ వేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రెండు జట్ల ప్లేయర్ల కంటే కూడా రణ్ వీర్ సింగ్ పాపులర్ కావడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.