Home /News /sports /

IPL 2022 BIG TENSION TO LUCKNOW SUPER GIANTS WILL MARK WOOD PLAY UP COMING SEASON SRD

IPL 2022 : కేఎల్ రాహుల్ జట్టుకు భారీ షాక్.. 7.5 కోట్ల రూపాయలు వృధా అయినట్టేనా..!

IPL 2022

IPL 2022

IPL 2022 : ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త‌గా రెండు జ‌ట్లు ప్ర‌వేశించాయి. అందులో ఒక‌టి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) కాగా, మ‌రో జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్‌ (Gujarat Titans). దీంతో ఈ రెండు టీంలు లీగ్‌లో ఎలా ఆడ‌తాయోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
  మరో కొద్ది రోజుల్లో  క్రికెట్ కుంభమేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 15వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపుల్ని కూడా మొదలుపెట్టేశాయ్. ఈ సారి ఐపీఎల్‌లోకి కొత్త‌గా రెండు జ‌ట్లు ప్ర‌వేశించాయి. అందులో ఒక‌టి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (Lucknow Super Giants) కాగా, మ‌రో జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్‌ (Gujarat Titans). దీంతో ఈ రెండు టీంలు లీగ్‌లో ఎలా ఆడ‌తాయోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కు సరికొత్త తలనొప్పి మొదలైంది. వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న కీలక ఆటగాడు, ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ (Mark Wood) గాయం బారిన పడ్డాడు. ఊహించని ఈ పరిణామంతో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని లక్నోకి ఒక్కసారిగా భారీ షాక్ తగిలినట్టైంది.

  అసలే నాణ్యమైన పేసర్‌ బౌలర్ లేడని కుమిలిపోతున్న LSGని మార్క్‌ వుడ్‌ గాయం మరింత కలవరపాటుకు గురి చేస్తుంది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌తో పోటీపడి మరీ సొంతం చేసుకున్న ఆటగాడు లీగ్‌కు ముందు గాయపడటంతో లక్నో శిబిరంలో ఆందోళన మొదలైంది.

  మార్క్ వుడ్ కి గాయం..


  వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మూడో రోజు ఆటలో బౌలింగ్‌ చేస్తుండగా మార్క్‌ వుడ్‌ మోచేతికి గాయమైంది. దీంతో మైదానం వీడిన అతను తిరిగి బౌలింగ్‌కు రాకపోగా, డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అతని గాయంపై ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

  ఇది కూడా చదవండి :  కోహ్లీకి వర్తించిన రూల్స్ రోహిత్ శర్మకి వర్తించవా..? విరాట్ విషయంలో మరీ ఇంత అన్యాయమా..!

  అయితే, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్న మార్క్‌ వుడ్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఏకంగా ఏడున్నర కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న వాంఖడే వేదికగా లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.

  ల‌క్నో పూర్తి జ‌ట్టు ఇదే

  కేఎల్‌ రాహుల్‌(17 కోట్లు), మార్కస్ స్టొయినిస్‌(9.2 కోట్లు), రవి బిష్ణోయ్‌(4 కోట్లు), అవేశ్‌ ఖాన్‌(10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య(8.25 కోట్లు), మార్క్‌ వుడ్(7.50 కోట్లు), క్వింటన్ డికాక్‌( 6.75 కోట్లు), దీపక్‌ హుడా(5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్(90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్‌(50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, KL Rahul, Lucknow

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు