ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్.. బీసీసీఐ (BCCI) అనుకున్న రీతిలో సాగడం లేదు. కొత్తగా రెండు జట్లు లీగ్ లోకి ఎంటర్ అవ్వడం... అలాగే కోవిడ్ తర్వాత భారత్ (India) లో పూర్తి స్థాయిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనుండటంతో లీగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు కనిపించింది. అంతే కాకుండా ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలానికి ఎన్నడూ లేనంత ప్రచారం జరగడంతో ఈసారి ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా బీసీసీఐ. అయితే ఐపీఎల్ ఆరంభం అయ్యాక... లెక్కలన్నీ మారిపోయాయ్. అసలు ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా మ్యాచ్ లన్నీ మహారాష్ట్రలో జరుగుతుండటం... అదే సమయంలో టాప్ బ్రాండ్ వాల్యూ కలిగిన ముంబై, చెన్నై సరిగ్గా ఆడకపోవడంతో ఐపీఎల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయ్. మరోవైపు, తొలి వారంలో RRR మూవీ దెబ్బకొడితే.. ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ 2 ప్రభావం చూపింది.
తొలి వారం ఐపీఎల్ రేటింగ్స్ దారుణంగా పడిపోగా... ఇప్పుడు రెండో వారం కూడా ఆకట్టుకోలేకపోయింది. ప్రేక్షకులు పెద్దగా ఐపీఎల్‌ను పట్టించుకోవడం లేదు. అటు టీవీల్లో.. ఇటు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గింది. ఈ ఊహించని పరిణామం స్టార్ ఇండియాకు తీవ్రని నష్టం తెచ్చేలా ఉంది. ఈ సీజన్‌కు యాడ్స్ రేట్లను స్టార్ ఇండియా 25 శాతం పెంచినా.. గతేడాది ఆదరణ నేపథ్యంలో కంపెనీలు ఎగబడ్డాయి. కానీ ఈ సారి ప్రేక్షకాదరణ తగ్గడంతో స్టార్ ఇండియాపై గగ్గోలు పెడుతున్నాయి.
ఇది బీసీసీఐకి కూడా తీవ్రని నష్టం తెచ్చేలా ఉంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ అమ్మకం ద్వారా రూ.35-40 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐకి తాజా టీఆర్‌పీ రేటింగ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా రెండు వారాలు రేటింగ్స్ పడిపోవడంతో బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ విషయంలో ఆయా కంపెనీల ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే తొలి వారం టీఆర్‌పీ టీఆర్‌పీ రేటింగ్స్ ఏకంగా 33 శాతం తగ్గిపోగా.. వ్యూయర్ షిప్ 14 శాతం పడిపోయింది.
ఇది కూడా చదవండి : బాబు, హార్దిక్ జర జాగ్రత్త.. ఎక్కడో తేడా కొడుతోంది.. అసలకే టీ20 వరల్డ్ కప్ ఉంది..
రెండో వారంలో టీఆర్‌పీ రేటింగ్స్ 28 శాతం తగ్గిపోయింది. బార్క్ ఇండియా లెక్కల ప్రకారం గతేడాది తొలి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ టీఆర్‌పీ రేటింగ్ 3.75గా ఉండగా.. ఈ సారి అది 2.52కి పడిపోయింది. ఆన్‌లైన్ వేదికగా వ్యూయర్‌షిప్ గతేడాది ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో 267.7 మిలయన్స్ వ్యూస్ రాగా.. ఈ సారి ఆ సంఖ్య 229.06 మిలియన్స్‌కు పడిపోయింది. రెండో వారంలో కూడా వ్యూస్ తగ్గాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, IPL 2022, KGF Chapter 2, Rrr movie