IPL 2022 BHAI LAND KARAO THIS HAPPENED DURING RAJASTHAN ROYALS FLIGHT FROM MUMBAI TO KOLKATA WATCH SRD
Viral Video : రాజస్థాన్ విమానంలో గడిబిడి.. విమానం దించు అంటూ ఆటగాళ్ల కేకలు.. కారణమిదే..
Photo Credit : Twitter
Viral Video : మే 24న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. దీంతో, క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం ముంబై నుండి కోల్‌కతాకు రాజస్థాన్ టీం శనివారం విమానంలో బయలుదేరింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే నాలుగు జట్లు ఏవో తేలిపోయాయి. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) జట్లు ఒకరిపై ఆధారపడకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే.. నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangaore) మాత్రం నాకౌట్ దశకు చేరుకోవడానికి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై ఆధారపడాల్సి వచ్చింది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సూపర్ విక్టరీతో రెండో స్థానాన్ని దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. దీంతో.. ఫైనల్ వెళ్లేందుకు రెండు ఛాన్సులు దక్కించుకుంది.
ఈ విజయం వల్ల క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ రాయల్స్ ఆడనుంది. మే 24న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. దీంతో, క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం ముంబై నుండి కోల్‌కతాకు రాజస్థాన్ టీం శనివారం విమానంలో బయలుదేరింది.
ఈ క్రమంలో విమాన ప్రయాణంలో వారికి వింత అనుభవం ఎదురైంది. వాతావరణ పరిస్థితుల వల్ల విమానంలో దట్టమైన పొగమంచు చేరింది. దీంతో రాజస్థాన్ టీంలో ఓ ప్లేయర్ పైలెటు విమానం దించు దించు అంటూ కేకలు వేశాడు. ఇక టీంలోని మరోప్లేయర్ ల్యాండ్ చేస్తున్నాం కాసేపు ఓపిక పట్టు అంటూ సరదాగా అన్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
— Rajasthan Royals (@rajasthanroyals) May 22, 2022
ఈ వీడియోలో యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌తో సహా ఇతర సభ్యులు ఇలా సరదాగా ప్రవర్తించినట్లు కన్పించింది. చివరకు విమానం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. రాజస్థాన్ రాయల్స్ సభ్యులందరూ బైబై చెబుతూ విమానం నుంచి దిగారు. విమానం మేఘాల్లో నుంచి దూసుకుపోవడంతో కాసేపు పొగమంచు వల్ల ఫ్లైట్‌లో పూర్తిగా దట్టమైన మంచు చేరింది. దీంతో రాజస్థాన్ ప్లేయర్లు కాసేపు భయాందోళనకు గురయ్యారు. చివరకి అంతా సర్దుకోవడంతో ఆటగాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక, మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడబోతున్నాయి. మొదటి ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడబోతోంది లక్నో సూపర్ జెయింట్స్. రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టుతో, మొదటి క్వాలిఫైయర్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోతున్నాయి. ఈ రెండు మ్యాచులు ముగిసిన తర్వాత రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ తరలివెళ్తాయి మూడు జట్లు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.