హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: బయో బబుల్ కొత్త రూల్స్ ఇవే... నిబంధనలు అతిక్రమిస్తే తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ

IPL 2022: బయో బబుల్ కొత్త రూల్స్ ఇవే... నిబంధనలు అతిక్రమిస్తే తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ

ఐపీఎల్ 2022

ఐపీఎల్ 2022

IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ ను సవ్యంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలను చేపడుతుంది. ఈసారి బయో బబుల్ ను కఠినంగా అమలు పరిచేలా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కఠిన నిబంధనలను రూపొందించింది. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారి తాట తీసేందుకు కూడా రెడీ అయ్యింది. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ మొత్తం మహారాష్ట్ర (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముంబైలోని మూడు స్టేడియాలతో పాటు పుణేలోని ఓ స్టేడియంలో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లను జరిపేలా షెడ్యూల్ ను రూపొందించింది. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల తేదీలు వేదికలు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే  మ్యాచ్ నిబంధనలను విడుదల చేసిన బీసీసీఐ తాజాగా బయో బబుల్ నిబంధనలకు కూడా విడుదల చేసింది. గతేడాది కరోనా కారణంగా ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాదాపు మూడు నెలల పాటు వాయిదా పడిన ఐపీఎల్ మళ్లీ సెప్టెంబర్ లో యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న సౌవర్ గంగూలీ (Sourav ganguly) అండ్ కో ఈసారి ’బయో బబుల్‘ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్లేయర్, ప్లేయర్ కుటుంబ సభ్యులు, ఫ్రాంచైజీ ఇలా ఎవరైనా సరే బయో నిబంధనలను అతిక్రమిస్తే తాట తీసేలా రూల్స్ ను రూపొందించింది. అవేంటంటే..

ఆటగాడు అతిక్రమిస్తే

1.  తొలి సారి బయో బబుల్ రూల్స్ ను బ్రేక్ చేస్తే సదరు ప్లేయర్ 7 రోజుల పాటు క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది. ఈ ఏడు రోజుల పాటు సదరు ప్లేయర్ ఫ్రాంచైజీ మ్యాచ్ లు ఆడినా... క్వారంటైన్ లో ఉండే ప్లేయర్ కు మాత్రం ఫీజు రూపంలో చిల్లి గవ్వ రాదు.

2. రెండోసారి బయో బబుల్ రూల్స్ ను అతిక్రమిస్తే ఈ సారి ఏడు రోజుల పాటు ఓ మ్యాచ్ నిషేధం (ఫీజులో 100 శాతం కోత) ఉంటుంది.  క్వారంటైన్ లో ఉన్నన్ని రోజుల కూడా అతడికి మ్యాచ్ ఫీజు రాదు.

3. మూడోసారి బయో బబుల్ రూల్ ను అతిక్రమిస్తే ఆ ప్లేయర్ ను ఐపీఎల్ నుంచి తొలగిస్తారు. అతడి స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకునే అవకాశం కూడా సదరు ఫ్రాంచైజీకి ఉండదు.

కుటుంబ సభ్యులు అతిక్రమిస్తే

ప్లేయర్ లేదా అతడితో పాటు బయో బబుల్ లో ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తే... ఆ కుటుంబ సభ్యుడితో పాటు ఆ ప్లేయర్ కు కూడా ఇబ్బందులు తప్పవు.

1. తొలిసారి అతిక్రమిస్తే సదరు కుటుంబ సభ్యుడితో పాటు ప్లేయర్ 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ప్లేయర్ కు ఆ ఏడు రోజుల పాటు మ్యాచ్ ఫీజు ఉండదు.

2.రెండోసారి అతిక్రమిస్తే సదరు కుటంబ సభ్యుడిని ఐపీఎల్ బయో బబుల్ నుంచి బయటకు పంపేస్తారు. ఆ కుటుంబ సభ్యుడితో సన్నిహితంగా ఉన్న ప్లేయర్ ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫీజు ఉండదు.

ఫ్రాంచైజీ అతిక్రమిస్తే

ఏదైనా ఫ్రాంచైజీ బయటి వ్యక్తులను ఎటువంటి క్వారంటైన్ నిబంధనలను పూర్తి చేయకుండా నేరుగా బయో బబుల్ లోకి అనుమతిస్తే అప్పుడు సదరు ఫ్రాంచైజీ బయో బబుల్ నిబంధనలను అతిక్రమించినట్లు అవుతుంది.

తొలిసారి జరిగితే ఆ జట్టుకు రూ కోటి రూపాయల జరిమానాను విధిస్తారు. రెండో సారి జరిగితే ఆ జట్టు సాధించిన పాయింట్ల నుంచి ఒక పాయింట్ కోత విధిస్తారు. మూడో సారి జరిగితే రెండు పాయింట్లను కోత విధిస్తారు. ఇక్కడి నుంచి బయో నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిసారీ సదరు టీంకు రెండు పాయింట్ల చొప్పున కోత విధించడం జరుగుతుంది.

First published:

Tags: Bcci, IPL, IPL 2022, Maharashtra, Sourav Ganguly

ఉత్తమ కథలు