Home /News /sports /

IPL 2022 BCCI INTRODUCED NEW RULES FOR IPL COMING SEASON KEY CHANGES HAPPENED IN DRS SUPER OVER SJN

IPL 2022: ఐపీఎల్ కొత్త రూల్స్ ఇవే... డీఆర్ఎస్ లో మార్పులు.. అలాగే సూపర్ ఓవర్ విషయంలోనూ కీలక నిర్ణయం

ఐపీఎల్ 2022

ఐపీఎల్ 2022

IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీఆర్ ఎస్ (DRS) తో పాటు సూపర్ ఓవర్, ఏదైనా టీంలో కరోనా పాజిటివ్ ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎం చెయ్యాలనే విషయాలపై బీసీసీఐ కొన్ని కీలక నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియా (India) వర్సెస్ శ్రీలంక (Sri lanka) సిరీస్ ముగిసింది. ఇక ధనాధన్ షాట్లకు కేరాఫ్ ఆడ్రస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు వేళయింది.  మార్చి 26 నుంచి ఐపీఎల్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీఆర్ ఎస్ (DRS) తో పాటు సూపర్ ఓవర్, ఏదైనా టీంలో కరోనా పాజిటివ్ ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎం చెయ్యాలనే విషయాలపై బీసీసీఐ కొన్ని కీలక నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే చదవండి

డీఆర్ ఎస్ (DRS)

డెసిషన్ రివ్యూ సిస్టం... అంపైర్ల పొరపాటు నిర్ణయాలకు సంజీవని లాంటిది. అంపైర్ నిర్ణయం తప్పని అనిపిస్తే వ్యతిరేకంగా వచ్చిన ప్లేయర్ కానీ లేదా టీం కెప్టెన్ కానీ డీఆర్ ఎస్ కు వెళ్లొచ్చు. దాంతో కచ్చితమైన నిర్ణయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ డీఆర్ ఎస్ అమలులో ఉంది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ నుంచి ఇందులో స్వల్ప మార్పు ఉండబోతుంది. గత సీజన్ వరకు ప్రతి టీం కూడా ఇన్నింగ్స్ కు ఒకసారి మాత్రమే డీఆర్ ఎస్ ను ఉపయోగించే వీలు ఉండేది. ఒక వేళ అది తప్పని తేలితే... ఆ టీం డీఆర్ ఎస్ ను కోల్పోతుంది. తాజాగా బీసీసీఐ డీఆర్ ఎస్ సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి టీం కూడా ఇన్నింగ్స్ కు రెండు సార్లు డీఆర్ ఎస్ ను వాడేలా నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. అంటే ఐపీఎల్ 15వ సీజన్ లో ప్రతి ఇన్నింగ్స్ లో ఒక్కో జట్టు రెండు డీఆర్ ఎస్ కూడా రెండేసి చొప్పున డీఆర్ ఎస్ లను ఉపయోగించవచ్చు.

ప్లే ఆఫ్స్ లో సూపర్ ఓవర్ సాధ్య పడకపోతే

గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ 4లో నిలిచిన నాలుగు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. అప్పుడు ఎప్పటిలానే టాప్ 2 జట్ల మధ్య ఫైనల్ క్యాలిఫయర్ మ్యాచ్... మూడు నాలుగు స్థానాల్లో మిగిలిన జట్ల మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరుగుతుంది. అనంతరం క్వాలిఫయర్ 1లో ఓడిన టీం మధ్య... ఎలిమినేటర్ 1 టీం విజేత మధ్య మరో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 1లో గెలిచిన టీంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే తాజాగా ప్లే ఆఫ్స్ విషయంలో బీసీసీఐ ఓ కొత్త రూల్ ను తీసుకురానుంది. అదేంటంటే.. ఇప్పుడు టీం ’ఎ‘, టీం ‘బి‘ మధ్య ఓ ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగిందనుకోండి. ఆ మ్యాచ్ చివరకు టైగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అవసరం కాగా... వర్షంతో అది సాధ్యపడలేదు. అప్పుడు గ్రూప్ దశలో ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టు అత్యధిక పాయింట్లు సాధించాయో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు.

ఇక మూడో రూల్ ఎంటంటే... మ్యాచ్ కు ముందు ఏదైనా జట్టులోని ప్లేయర్స్ కరోనా బారిన పడి ఆ మ్యాచ్ సాధ్యపడకపోతే బీసీసీఐ ఆ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసే వీలుంటుంది. ఒక వేళ మ్యాచ్ జరపడం సాధ్యపడక పోతే కరోనా వల్ల మ్యాచ్ ఆడలేకపోయిన టీంను లూజర్స్ గా డిక్లేర్ చేసి... ప్రత్యర్థి టీంను విజేతగా ప్రకటిస్తారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs srilanka, IPL, IPL 2022, Sri Lanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు