WT20 Challenge : మహిళల విభాగంలో జరిగే టి20 చాలెంజ్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) సోమవారం విడుదల చేసింది. మే 23 నుంచి 28 మధ్య మూడు జట్లతో ఈ టోర్నీ జరగనుంది. కోవిడ్ 19 వల్ల మ్యాచ్ లన్నీ కూడా పుణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.
WT20 Challenge : మహిళల విభాగంలో జరిగే టి20 చాలెంజ్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) సోమవారం విడుదల చేసింది. మే 23 నుంచి 28 మధ్య మూడు జట్లతో ఈ టోర్నీ జరగనుంది. కోవిడ్ 19 వల్ల మ్యాచ్ లన్నీ కూడా పుణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి. గతంలోలాగే టోర్నీలో మూడు జట్లు.. వెలాసిటీ (Velocity), ట్రైల్ బ్లేజర్స్ (Trailblazers), సూపర్ నోవాస్ (Super Novas)జట్లు పాల్గొంటున్నాయి. అయితే గత మూడు సీజన్లలో వెలాసిటీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) ఈసారి మాత్రం ఆడటం లేదు. ఆమె స్థానంలో దీప్తి శర్మ ను వెలాసిటీ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ట్రయిల్ బ్లేజర్స్ కు స్మృతి మంధాన, సూపర్ నోవాస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ లు సారథులుగా వ్యవహరించనున్నారు. గతంలో ట్రయిల్ బ్లేజర్స్ జట్టులో భాగంగా ఉన్న జులన్ గోస్వామి, శిఖా పాండేలు కూడా ఈ ఏడాది ఆడటం లేదు.
మే 23న జరిగే తొలి మ్యాచ్ లో ట్రయిల్ బ్లేజర్స్ తో సూపర్ నోవాస్ ఆడుతుంది. మే 24న వెలాసిటీతో సూపర్ నోవాస్, మే 26న ట్రయిల్ బ్లేజర్స్ తో వెలాసిటీ జట్లు ఆడతాయి. ఒక్కో జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య మే 28న ఫైనల్ జరగనుంది.
ఒక్కో టీంలో 16 మంది ప్లేయర్స్
ఒక్కో జట్టులో 16 మంది ప్లేయర్స్ ఆడనున్నారు. ప్రతి జట్టులోనూ నలుగురు విదేశీ ప్లేయర్స్ ఆడనున్నారు. 2018లో ఆరంభమైన ఈ చాలెంజ్ టోర్నీ.. 2020 వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల 2021 సీజన్లో ఈ టోర్నీ జరగలేదు. ఇక వచ్చే ఏడాది నుంచి మహిళల విభాగంలో కూడా ఐపీఎల్ లాంటి టోర్నీని జరిపేందుకు బీసీసీఐ సిద్దమైంది కూడా.
దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ్ రాణా, ఆర్తి, అయబోంగా కాక, నావ్ గిరే, కేతరిన్ గ్రాస్, కీర్తి జేమ్స్, లారా, మాయా, నట్టఖాన్, రాధా యాదవ్, షఫాలీ వర్మ, షివ్లె షిండే, సిమ్రన్ బహదూర్, యస్తిక భాటియా, ప్రణవి చంద్ర
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.