BAN vs SL : క్రికెట్ లో బిల్డప్ బాబాయ్ లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Rpyals) ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) బిల్డప్ కు క్రికెట్ లవర్స్ తలలు బాదుకుంటుంటే.. తాజాగా అంతకుమించిన బిల్డప్ తో బంగ్లాదేశ్ (bangladesh) క్రికెటర్ రెడీ అయ్యాడు. ఏకంగా ఆల్ టైమ్ క్రికెట్ దిగ్గజంతోనే తనను పొలుస్తున్నారంటూ బాంబు పల్చాడు. పసికూనగా క్రికెట్ ప్రపంచంలో అడుగు పెట్టిన బంగ్లాదేశ్ అనతి కాలంలోనూ టాప్ టీమ్ గా ఎదిగిపోయింది. టెస్టుల్లో అటుంచితే పరిమిత ఓవర్ల క్రికెట్ అయిన వన్డేలు, టి20ల్లో పెద్ద జట్లకు సైతం షాకిచ్చే స్థాయికి ఎదిగింది.
ఇది కూడా చదవండి : నువ్వు తోపు పంత్.. అంతా నువ్వు చేసి ఇప్పుడు వేరేవాళ్లపైకి.. కాస్త మారబ్బా!
తాజాగా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టు సందర్భంగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులతో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించానన్న గర్వంతో ఊగిపోతున్న రహీమ్ బిల్డప్ బాబాయ్ అవతారమెత్తాడు. ఆకాశానికి నిచ్చెన వేసేలా ప్రగల్బాలు పలికి వివాదానికి కారణం అయ్యాడు.
ఇది కూడా చదవండి : ఇంతకీ విరాట్ కోహ్లీ ఎవరిని హెల్ప్ అడిగినట్లు.. రోహిత్ నా లేక పంత్ నా? ట్విట్టర్ లో ఫ్యాన్స్ ఫైర్
సర్ డాన్ బ్రాడ్ మన్ ను క్రికెట్ మెజీషన్ అంటూ కీర్తిస్తారు. ఇక ఆయనతో పోలిక అంటే అది మామూలు విషయం కాదు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం బ్రాడ్ మన్ తో పోలిక తగదన్నారు. ఇక బ్రాడ్ మనే సచిన్ ఆట తనకెంతో ఇష్టమని స్టేట్ మెంట్ ఇచ్చినా కూడా ఆయనతో తనను పోల్చవద్దంటూ సున్నితంగా వివరణ ఇచ్చాడు. అయితే తాజాగా ముష్ఫికర్ రహీం మాత్రం బ్రాడ్ మన్ తో పోలికను తీసుకొచ్చాడు. సెంచరీ చేసిన తర్వాత మాట్లాడిన రహీం.. ’బంగ్లాదేశ్ తరఫున 5 వేల టెస్టు పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలవడం గర్వంగా ఉంది. అయితే ఈ రికార్డును చాలామంది సీనియర్లు బద్దలు కొడతారు. బంగ్లా జట్టులో 8 వేల పరుగులు, 10 వేల పరుగులు చేసే ఆటగాళ్లు కూడా ఉన్నారు. నేను బ్యాటింగ్ చేస్తుంటే బంగ్లాదేశీలకు బ్రాడ్‌మన్‌లా కనిపిస్తాను. అలా వారు అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది‘ అంటూ బ్రాడ్ మన్ తో పోల్చుకున్నాడు.
ఇది కూడా చదవండి : మ్యాచ్ ను కవరేజ్ చేయమంటే.. ఈ కెమెరామెన్ ఏం చేస్తున్నాడో చూడండి! (వీడియో)
ముష్ఫికర్ రహీమ్ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తరఫున 81 టెస్టులు ఆడాడు. 8 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలతో 5,037 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక క్రికెట్ దిగ్గజంతో పోలికేంటి అంటూ నెటిజన్లు రహీమ్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, IPL, IPL 2022, Sachin Tendulkar