Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బోణీ కొట్టింది. శనివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఘనవిజయం సాధించి లీగ్ లో పాయింట్ల ఖాతా తెరిచింది. రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నాడు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టడం విశేషం. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్లోగా ఉన్న పిచ్ పై ఛేజింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ కు మరోసారి శుభారంభం లభించలేదు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే పెవలియన్ కు చేరాడు. అయితే ఇక్కడే కథంతా ఉంది.. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి.
ఇషాన్ కిషన్ ముంబై ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభిస్తే మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం క్రీజులో ఉన్నంత సేపు తడబడ్డాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడో ఓవర్ వేయడానికి రాగా.. అతడు వేసిన మూడో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడబోయాడు. అయితే బ్యాట్ అంచుకు తగిలిన బంతి అక్కడే గాల్లోకి లేవగా.. డారెల్ మిచెల్ క్యాచ్ ను అందుకున్నాడు. దాంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక బర్త్ డే రోజు రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలనుకున్న అతడి భార్య రితక మొహం అయితే పూర్తిగా వాడిపోయింది. ఏడుపు మొహం పెట్టి దిగాలుగా కూర్చొంది. అయితే పక్కనే ఉన్న అశ్విన్ భార్య ప్రీతి రితిక దగ్గరకు వెళ్లి ఓదార్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
राजस्थान और मुंबई के बीच हुए आईपीएल मैच में रोहित शर्मा जब आउट हुए तो उनकी पत्नी रितिका उदास हो गई ।उसी वक्त उनका विकेट लेने वाले अश्विन की पत्नी प्रीति से यह देखा नहीं गया और उन्होंने रितिका के पास जाकर उन्हें गले लगा लिया#IPL2022 #ashwinwife #RohitSharma #Ashwin #RitikaSajdeh pic.twitter.com/llOwiAyKAj
— Akash Mishra (@akashmishra1811) May 1, 2022
అయితే సూర్యకుమార్ యాదవ్ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (30 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ లక్ష్యం వైపుకు దూసుకెళ్లింద. సూర్య కుమార్ యాదవ్ దంచి కొట్టగా.. తిలక్ వర్మ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించాడు. దాంతో ముంబై ఇన్నింగ్స్ లక్ష్యం వేపు సాఫీగా సాగిపోయింది. అయితే వీరిద్దరు కూడా వెంట వెంటనే పెలియన్ కు చేరడంతో ముంబై విజయంపై మరోసారి అనుమానాలు రేకెత్తాయి. అయితే టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా.. గెలుపుకు నాలుగు పరుగులు అవసరం అయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన డానియెల్ స్యామ్స్ తొలి బంతినే సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Jasprit Bumrah, Kane Williamson, MS Dhoni, Mumbai Indians, Rajasthan Royals, Ravichandran Ashwin, Rohit sharma, Sanju Samson, Sunrisers Hyderabad