ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో థర్డ్ అంపైర్లు తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదానికి కేంద్రంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. అంపైర్లు చేస్తోన్న తప్పిదాలతో జట్ల ఫలితాలు తారుమారు అవుతున్నాయ్. ఫీల్డ్ అంపైర్స్ నుంచి థర్డ్ అంపైర్ వరకు చూసుకుంటే తమ తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లను బలిచేశారు. ముఖ్యంగా కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ఔట్ విషయంలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అంపైర్ల నిర్ణయాలతో ఆటగాళ్లు సహనం కోల్పోవడం కూడా మనం చూశాం. ఇక, బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన మ్యాచులో కూడా ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. అంపైర్ నిర్ణయంతో సహనం కోల్పోయిన గుజరాత్ ఆటగాడు మాథ్యూ వేడ్ నానా రచ్చ చేశాడు. చివరికి చీవాట్లు తిన్నాడు.
వివరాల్లోకెళితే.. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్లేన్ మాక్స్వెల్ బౌలింగ్‌లో మాథ్యూవెడ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కానీ.. బంతి బ్యాట్‌కి తాకిందని ఆరోపించిన మాథ్యూవెడ్.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగానే డీఆర్ఎస్ కోరాడు. కానీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఆల్ట్రా ఎడ్జ్‌లో సరిగా పరిశీలించకుండా.. బాల్ ట్రాకింగ్ ఆధారంగా ఔట్ అని ప్రకటించాడు. దాంతో.. తిట్టుకుంటూ పెవిలియన్‌కి వెళ్లిన మాథ్యూవెడ్.. డ్రెస్సింగ్ రూములో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్‌పై ఉన్న కోపాన్ని తన బ్యాట్, హెల్మెట్‌పై చూపించాడు.
— Cred Bounty (@credbounty) May 19, 2022
— Cred Bounty (@credbounty) May 19, 2022
తన బ్యాట్, హెల్మెట్‌ను నేలకు కొడుతూ ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. మాథ్యూవేడ్ భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు లైవ్‌లో స్టేడియంలోని పెద్ద స్క్రీన్లపై ప్రత్యక్షమయ్యాయి. దీంతో.. మాథ్యూ వేడ్ క్రమ శిక్షణ తప్పి మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళిని ఉల్లఘించిన మాథ్యూవెడ్ను మొదటి తప్పిదంగా భావించి మ్యాచ్ రిఫరీ మందలించాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
Mathew Wade is NOT happy.
Cool down Wade. #RCBvsGT #LBW pic.twitter.com/VwhDM3yveX
— Sunil Kumar (@Sunilkumar6975) May 19, 2022
ఇక.. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో విజయాన్నందుకున్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 నాటౌట్), మిల్లర్ (25 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు.
ఇది కూడా చదవండి : వామ్మో.. గంగూలీ కొన్న కొత్త బంగ్లా అన్ని కోట్లా.. రెండు సినిమాలు తీయొచ్చు భయ్యా..!
ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడుగా... డుప్లెసిస్ (38 బంతుల్లో5 ఫోర్లతో 44) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Gujarat Titans, IPL 2022, Royal Challengers Bangalore, Viral Video