ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఓ సంచలనం. జమ్మూ కశ్మీర్ కు చెందిన ఈ యువ పేసర్ ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున ఆడుతున్నాడు. బంతిని 150 కి.మీ వేగంతో వేయగల సత్తా ఇతడి సొంతం. మ్యాచ్ కు ఒకటో రెండో బంతులు వేగంగా వేసి అనంతరం తక్కువ వేగంతో వేయడం ఉమ్రాన్ మాలిక్ కు అసలు తెలియదు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 14 మ్యాచ్ లు ఆడిన అతడు.. 49.1 ఓవర్లు వేశాడు. అంటే 295 బంతులు వీటిలో 240కి పైగా బంతులను 145 ప్లస్ తో వేశాడంటేనే అర్థం అవుతుంది. ఇతడిలో పేస్ ఏ విధంగా ఉందో. ఇక, ఇతని పేస్ ధాటికి మహామహా బ్యాటర్లు కూడా బెంబెలెత్తిపోయారు. అతని రాకాసి బౌన్సర్లకు ప్రత్యర్థుల దగ్గర సమాధానమే లేదు.
ఇక, లేటెస్ట్ గా ఉమ్రాన్ మాలిక్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిల్లర్ బంతితో రెచ్చిపోయాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఎదుర్కొన్న తొలి బంతికే నేలమీద పడిపోయాడు. మయాంక్ అగర్వాల్ ఎదుర్కొన్న తొలి బంతికి భయపెట్టాడు ఈ స్పీడ్ గన్. పవర్ ప్లే ముగిసిన తర్వాత ఏడో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ మూడో బంతికే షారూఖ్ ఖాన్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్‌పై వేగంగా బాడీ అటాకే టార్గెట్‌గా ఉమ్రాన్ బంతిని విసిరాడు.
అది నేరుగా పక్కటెముకలకు తగలడంతో రన్‌ని పరిగెత్తి నాన్ స్ట్రయిక్ ఎండ్ క్రీజ్‌లో కూలబడ్డాడు. పక్కటెముకలకు బలంగా బంతి తాకడంతో ఫిజియో గ్రౌండ్‌లోకి వచ్చాడు. కనీసం ఒక ఐదు నిమిషాలకు పైగా ఇబ్బంది పడిన మయాంక్ ఒకానొక దశలో రిటైర్డ్ హర్ట్‌గా బయటకు వస్తాడని భావించినా.. ఆ తర్వాత నొప్పితోనే బ్యాటింగ్ చేశాడు. నాలుగు బంతులు ఆడిన మయాంక్ కేవలం ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు.
#PBKSvsSRH pic.twitter.com/EvPAWBzuOc
— Jemi_forlife (@jemi_forlife) May 22, 2022
అయితే, సన్‌రైజర్స్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో చివరి బంతికి ఉమ్రాన్ మాలిక్ క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే.. అంతకుముందు ఇన్నింగ్స్ ఆఖరి బంతి నో బాల్ కావడంతో ఉమ్రాన్ క్రీజులోకి రావడం ఆలస్యమైంది. ఉమ్రాన్ క్రీజులోకి వస్తున్న సమయంలో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ ఉమ్రాన్ ను వెక్కిరించాడు. ఉమ్రాన్‌తో పాటు రన్నింగ్ చేస్తూ ఏదో చెప్పాడు. ఆ కోపాన్ని మయాంక్ బ్యాటింగ్‌కి రాగానే కిల్లర్ బంతి రూపంలో ఉమ్రాన్ వడ్డీతో సహా చెల్లించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మనతో పరచాకాలు వద్దమ్మా.. లెక్కకు లెక్కకు చెల్లిస్తాం అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
— Cred Bounty (@credbounty) May 22, 2022
What a Revenge #UmranMalik but bro dhyan se indian player hi hai kuch ho na jaye🥺 mayank Agarwal ♥️ #SRHvsPBKS
— izhar shaikh (@iamizhar29) May 22, 2022
ఇక, ఈ సీజన్ లో 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీయడం ద్వారా.. సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. తన స్ఫీడుతో ఈ సీజన్ లో ఎన్నో రికార్డుల్ని అవలీలగా బద్దలు కొడుతున్నాడు. లూకీ ఫెర్గ్యూసన్, అన్రిచ్ నోకియా, రబాడా, బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు వేయలేని స్పీడు కూడా ఈ కుర్రాడు వేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డుకెక్కాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న ఉమ్రాన్.. నిలకడగా గంటకు 150 కిలోమీట్ల వేగంతో బంతులను సంధిస్తూ అందరి దృష్టి ఆకర్షించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Punjab kings, Sports, Sunrisers Hyderabad, Viral Video