Home /News /sports /

IPL 2022 AFTER ADAM GILCHRIST DEWALD BREVIS BECOME 2ND BOWLER TO TAKE FIRST BALL WICKET IN IPL HISTORY SJN

IPL 2022: ఐపీఎల్ లో బేబీ ఏబీ అరుదైన రికార్డు... గిల్ క్రిస్ట్ తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా...

డివాల్డ్ బ్రేవిస్

డివాల్డ్ బ్రేవిస్

IPL 2022: ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలంలో సాతాఫ్రికా అండర్ 19 ప్లేయర్ డివాల్ట్ బ్రేవిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అందుకు కారణం అతడిని రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) లాంటి పటిష్ట జట్టు ఎంపిక చేసుకోవడమే. అంతకుముందే జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన అతడు 500 పైచిలుకు పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇంకా చదవండి ...
IPL 2022: ఫిబ్రవరి నెలలో జరిగిన మెగా వేలంలో సాతాఫ్రికా అండర్ 19 ప్లేయర్ డివాల్ట్ బ్రేవిస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అందుకు కారణం అతడిని రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) లాంటి పటిష్ట జట్టు ఎంపిక చేసుకోవడమే. అంతకుముందే జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన అతడు 500 పైచిలుకు పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డీవిలియర్స్ (ab de villiers) మాదిరి గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడగల సత్తా బ్రేవిస్ కు ఉండటంతో ఇతడిని సొంతం చేసుకోవడానికి వేలంలో చాలా టీమ్స్ పోటీ పడ్డాయి. 360 డిగ్రీల్లో షాట్లు ఆడుతుండటంతో బ్రేవిస్ కు బేబీ ఏబీ అనే పేరు కూడా వచ్చింది. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రేవిస్ ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : కోపంతో శివతాండవం చేసిన కోహ్లీ... ఈసారి ఏకంగా థర్డ్ అంపైర్ పైనే..!

అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రేవిస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్ గా బ్రేవిస్ నిలిచాడు. 19వ ఓవర్ వేయడానికి వచ్చిన బ్రేవిస్ తన తొలి బంతికే హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన విరాట్ కోహ్లీ (Virat Kohli)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీనిపై విరాట్ రివ్యూకు వెళ్లినా అక్కడ కూడా కోహ్లీకి వ్యతిరేకంగానే నిర్ణయం వచ్చింది. దాంతో ఐపీఎల్ లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్ గా బ్రేవిస్ నిలిచాడు. అయితే ఐపీఎల్ లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన తొలి  ప్లేయర్ గా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ఉన్నాడు.



2013 సీజన్ సందర్భంగా గిల్ క్రిస్ట్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆ సీజన్ లో అతడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. మే 18న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గిల్ క్రిస్ట్ ఈ ఘనతను సాధించాడు. ఆ మ్యాచ్ లో ముంబై చివరి ఓవర్ లో 51 పరుగులు చేయాల్సి ఉండగా... వికెట్ల వెనుక కీపర్ గా ఉండే గిల్ క్రిస్ట్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ప్రవీణ్ కుమార్ వికెట్ కీపర్ అవతారమెత్తాడు. గిల్ క్రిస్ట్ వేసిన తొలి బంతికే ముంబై స్పిన్నర్ హర్భజన్ సింగ్ వికెట్ తీశాడు. తద్వారా తొలి బంతికే వికెట్ తీసిన ప్లేయర్ గా గిల్ క్రిస్ట్ నిలిచాడు. గిల్ క్రిస్ట్ కెరీర్ లో ఇదే తొలి, ఆఖరి బంతి కావడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kings XI Punjab, Mumbai Indians, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు