IPL 2021-Eliminator: గెలిస్తే ఓకే.. ఓడితే ఇంటికే.. నేడు బెంగళూరు - కోల్‌కతా కీలక పోరు.. ఎవరికి ఛాన్స్?

ఆర్సీబీ-కేకేఆర్ మధ్య కీలకపోరు.. ఎలిమినేటర్‌లోగెలిచేదెవరు? (PC: IPL)

IPL 2021-Eliminator: ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్ ఈ రోజు షార్జా క్రికెట్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగనున్నది. కీలక పోరులో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రెండో క్వాలిఫయర్ ఆడనుంది.

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) ఫైనల్ బెర్తును చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఖాయం చేసుకున్నది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన క్వాలిఫయర్ 1లో 4 వికెట్ల తేడాతో గెలిచి 9వ సారి ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఇక ఫైనల్‌లో ఇంకో బెర్తు కోసం మూడు జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండో క్వాలిఫయర్ ద్వారా మరో చాన్స్ ఉండగా.. ఈ రోజు బెంగళూరు (Royal Challengers Bengaluru) - కోల్‌కతా (Kolkata Knight Riders) మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే ఎలిమినేటర్‌లో ఒక జట్టు నిష్క్రమించాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనపడుతున్నాయి. ఈ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెబుతానని విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే ప్రకటించాడు. వీడ్కోలు పలికే ముందు బెంగళూరుకు తొలి సారిగా ఐపీఎల్ ట్రోఫీ అందించాలని కలగంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి గెలిపించాడు. దీంతో ఆర్సీబీ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. మరో వైపు యువకులు, సీనియర్లతో నిండిన కోల్‌కతా జట్టు కూడా ఫైనల్స్ బెర్త్ కోసం గట్టిగానే పోటీ పడుతున్నది.

  ఈ సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు మంచి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టును ఆదుకుంటున్నాడు. ఇక శ్రీకర్ భరత్ అంచనాలను మించి రాణిస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా ఆడుతుండటం కలసి వస్తున్నది. దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ తొలి దశలో మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ యూఏఈకి వచ్చే సరికి ఫామ్ కోల్పోయారు. వీరిద్దరూ ఎలిమినేటర్‌లో తప్పకుండా ఒక మంచి భాగస్వామ్యాన్ని అందించాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. మరోవైపు యజువేంద్ర చాహల్ ఫామ్‌లో ఉండి కీలకమైన సమయంలో వికెట్లు తీస్తున్నాడు.

  T20 World Cup: అఫ్గానిస్తాన్‌కు ఐసీసీ ఝలక్ ఇవ్వనుందా? తాలిబాన్ జెండాతో వరల్డ్ కప్‌కు నిరాకరణ?
  ప్లే ఆఫ్స్ క్వాలిఫియేషన్ కొరకు కోల్‌కతా చివరి వరకు వెయిట్ చేయల్సి వచ్చింది. ముంబైతో కలసి సమానమైన పాయింట్లు ఉన్నా.. రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో కేకేఆర్ అర్హత సాధించింది. కోల్‌కతా నైట్‌రైజర్స్ యూఏఈలో ఆడిన 7 మ్యాచ్‌లకు గాను 5 మ్యాచ్‌లలో గెలిచి మంచి ఫామ్‌లో ఉన్నది. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగం మిగిలిన జట్ల కంటే ఎంతో బలంగా ఉన్నది. లాకీ ఫెర్గూసన్, శివమ్ మావీ మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, త్రిపాఠి, రాణా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే కెప్టెన్ మోర్గన్ బ్యాటింగ్ ఫామ్ పైనే ఆందోళన నెలకొన్నది. గత మ్యాచ్‌లో తలపడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

  జట్ల అంచనా:
  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డాన్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్

  కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, షకీబుల్ హసన్, సునిల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి
  Published by:John Naveen Kora
  First published: