Home /News /sports /

IPL 2021 WHOS HIGHEST PAID KKR PLAYER CHECK TOP 10 KKR PLAYERS GETTING HIGHEST SALARY JNK

IPL Salary : కోల్‌కతా టీమ్‌లో ఎక్కువ జీతం ఎవరికో తెలుసా? ఆ జట్టు టాప్ టెన్ సాలరీస్ ఇవే

Kolkata Knitht riders Logo: (Image: @KKR/Twitter)

Kolkata Knitht riders Logo: (Image: @KKR/Twitter)

  ఐపీఎల్‌లో 2020కి సంబంధించి అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమ్మిన్స్ రికార్డు సృష్టించాడు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ. 15.5 కోట్ల భారీ మొత్తానికి కొనుక్కున్నది. ఈ ఏడాది కూడా కేకేఆర్‌తో కొనసాగుతున్న అతడే అత్యధిక జీతాన్ని తీసుకుంటున్నాడు. మరి ఆ జట్టులో అత్యధిక వేతనాలు పొందుతున్న ఆటగాళ్ల టాప్ టెన్ లిస్ట్ ఇలా ఉన్నది.

  #1 పాట్ కమ్మిన్స్ (రూ. 15.5 కోట్లు)

  ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు ఆ దేశ జాతీయ జట్టుకు అన్ని ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్న కమ్మిన్స్ గత సీజన్‌లో కేకేఆర్ తరపున అంచనాల మేరకు రాణించలేదు.

  #2 సునిల్ నరైన్ (రూ. 12.5 కోట్లు)

  కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన ఈ వెస్టిండీస్ బ్యాట్స్‌మాన్ పలు పొజిషన్లలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక్కోసారి ఓపెనర్‌గా.. జట్టుకు అవసరమైన సమయంలో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నది. తన బౌలింగ్‌తో కూడా పలుమార్లు కీలక వికెట్లు తీసి కేకేఆర్ జట్టును ఆదుకున్నాడు.

  #3 ఆండ్రీ రస్సెల్ (రూ. 8.5 కోట్లు)

  ఐపీఎల్ 12వ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉండి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆండ్రీ రస్సెల్.. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. సిక్సులు అలవోకగా బాదే రస్సెల్ ఫామ్‌లో ఉంటే కోల్‌కతాకు విజయాలు వస్తూనే ఉంటాయి. ఈ సారి అతడు ఫామ్‌లోకి గనుక వస్తే తప్పకుండా భారీ స్కోర్లు ఆశించవచ్చు.

  #4 దినేష్ కార్తీక్ (రూ. 7.4 కోట్లు)

  టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్ కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. గత ఏడాది ఏడు మ్యాచ్‌ల అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బ్యాటింగ్ పరంగా కూడా అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నది. కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో కార్తీక్‌కు మంచి అనుభవం ఉన్నది. అవసరమైన సమయంలో భారీ సిక్సులు కూడా కొట్టగలడు. మరి ఈ సీజన్‌లో అతడి ప్రదర్శన ఎలా ఉండబోతున్నదో.

  #5 కుల్దీప్ యాదవ్ (రూ. 5.8 కోట్లు)

  చైనామన్ బౌలర్‌గా టీమ్ ఇండియా తరపున ఆడిన కుల్దీప్ ఈ మధ్య ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడ్డాడు. గత సీజన్‌లో 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కుల్దీప్ ఒకే వికెట్ తీశాడు. సీజన్‌లో ఎక్కువ సమయం బెంచ్‌ పైనే గడిపాడు. మరి ఈ సీజన్‌లో అతడికి తుది జట్టులో అవకాశం దొరుకుతుందా లేదా అనే అనుమానమే.

  #6 ఇయాన్ మోర్గాన్ (రూ. 5.2 కోట్లు)

  వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. ఈ ఏడాది కేకేఆర్ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న మోర్గాన్.. కొన్ని మంచి భాగస్వామ్యాలు అందించగలడు. ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరపున 66 మ్యాచ్‌లు ఆడి 1272 పరుగులు చేశాడు.

  #7 వరుణ్ చక్రవర్తి (రూ. 4 కోట్లు)

  మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీసిన వరుణ్ చక్రవరి.. 13వ సీజన్‌లో అత్యంత తక్కువగా 20 పరుగులు సగటు కలిగి ఉన్నాడు. అతడి అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాలో చోటు కల్పించింది. అయితే గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్న వరుణ్ మరోసారి గతేడాది మ్యాజిక్ పునరావృతం చేయాలని భావిస్తున్నాడు.

  #8 నితీష్ రాణా (రూ. 3.4 కోట్లు)

  కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఒక నమ్మకమైన బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా. ఓపెనర్‌గా లేదా ఫస్ట్ డౌన్‌లో రాణా ఒక అద్భుతమైన బ్యాట్స్‌మాన్‌గా నిరూపించుకున్నాడు. గత ఏడాది నిలకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కేకేఆర్ తరపున అతడికి ఇది నాలుగో సీజన్. టీమ్ ఇండియాలో చోటు కోసం రాణా ప్రయత్నిస్తున్నాడు. ఈ సారి అద్భుత ప్రదర్శన చేస్తే తప్పకుండా జాతీయ జట్టులోకి వస్తాడు.

  #9 షకీబుల్ హసన్ (రూ. 3.2 కోట్లు)

  ఐసీసీ నిషేధం ముగించుకొని తిరిగి క్రికెట్ ఆడుతున్న షకీబుల్ హసన్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఇది రెండో సారి. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. కానీ ఈ ఏడాది తిరిగి కేకేఆర్ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో 63 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 59 వికెట్లు తీయడంతో పాటు 749 పరుగులు కూడా చేశాడు.

  #10 కమలేష్ నాగర్‌కోటి (రూ. 3.2 కోట్లు)

  ఇండియా అండర్ 19 జట్టులో అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించిన కమలేష్ నాగర్‌కోటి 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలడు. 2018లోనే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినా అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. బంతితోనే కాకుండా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఈ యువక్రికెటర్ ఎలా రాణిస్తాడో చూడాలి.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Bcci, Cricket, IPL 2021, Kolkata Knight Riders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు