HOME »NEWS »SPORTS »ipl 2021 which players will be released retained by ipl teams sa 2

ముంబై నుంచి కౌల్టర్-నైలు.. SRH నుండి ఖలీల్.. టీంలు వదులుకునే ఆటగాళ్ళు వీరే!

ముంబై నుంచి  కౌల్టర్-నైలు.. SRH నుండి ఖలీల్.. టీంలు వదులుకునే ఆటగాళ్ళు వీరే!
srh

ఐపీఎల్ 2021 సంబంధించిన వేలం ఫిబ్రవరి 11 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 14 ఎడిషన్‌లో ఫ్రాంఛైజీలు ఊహించని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది

  • Share this:
    ఐపీఎల్ 2021 సంబంధించిన వేలం ఫిబ్రవరి 11 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 14 ఎడిషన్‌లో ఫ్రాంఛైజీలు ఊహించని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2020లో దారుణంగా విఫలమైన ఆటగాళ్ళను వదిలించుకునే ఆలోచనలో ఉన్నాయి.

    ఐపీఎల్ 2021 సీజన్‌కు సమయం సమీపిస్తున్న తరుణంలో టోర్నీ నిర్వహాణ కోసం బీసీసీఐ సన్నాహాలు మెుదలుపెట్టింది. ఐపిఎల్ 2021 వేలం ఫిబ్రవరి 11న ఎనిమిది ఫ్రాంఛైజీలతో కలిసి బీసీసీఐ నిర్వహించనుంది. దాని కంటే ప్రాంఛైజీలు విడుదల చేయాలనుకున్న ఆటగాళ్ల జాబితాను జనవరి 20లోగా సమర్పించాలని బీసీసీఐ ఆదేశించింది. అయితే ఐపీఎల్ 2021 వేలం తేదీని బీసీసీఐ అధికారంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం భారతదేశంలో COVID-19 మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడంతో వేదికగా, ఐపీఎల్ షెడ్యూల్ విషయంలో BCCI కాస్త వేచి చూసే ధోరణిలో ఉంది. ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. యుఎఇని రిజర్వ్ వేదికగా ఉంచింది బోర్డు.



    అయితే ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకుంటున్నా ఆటగాళ్ళు జాబితాను తయారుచేయడంలో తలమునకలై ఉన్నాయి. సంబంధించి జట్లు నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కింది ఆటగాళ్ళను విడుదల చేయడానికి సిద్దమవుతున్నాయి.

    ఐపిఎల్ 2021 వేలంలో విడుదల కానున్న ఆటగాళ్ల జాబితా

    చెన్నై సూపర్ కింగ్స్: కె.ఎమ్. ఆసిఫ్, పియూష్ చావ్లా, కేదార్ జాదవ్, మురళీ విజయ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్).

    ఢిల్లీ క్యాపిటల్స్: అవెష్ ఖాన్, సందీప్ లామిచనే, మోహిత్ శర్మ.

    ముంబై ఇండియన్స్: నాథన్ కౌల్టర్-నైలు

    రాజస్థాన్ రాయల్స్: జయదేవ్ ఉనద్కట్, అంకిత్ రాజ్‌పూత్, ఆండ్రూ టై.

    కోల్‌కతా నైట్ రైడర్స్: టామ్ బాంటన్, నిఖిల్ నాయక్, సందీప్ వారియర్.

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కృష్ణప్ప గౌతమ్, జేమ్స్ నీషామ్, ప్రభాసిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పవన్ నేగి, డేల్ స్టెయిన్ (ఐపిఎల్ 2021 నుండి వైదొలిగారు), ఉమేష్ యాదవ్.

    సన్‌రైజర్స్ హైదరాబాద్: సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్.
    Published by:Rekulapally Saichand
    First published:January 13, 2021, 12:27 IST

    टॉप स्टोरीज