హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: విరాట్ కొహ్లీ మరో సంచలన నిర్ణయం.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..

IPL 2021: విరాట్ కొహ్లీ మరో సంచలన నిర్ణయం.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..

విరాట్ కొహ్లీ

విరాట్ కొహ్లీ

Virat Kohli to Step Down as Royal Challengers Bangalore Captain: విరాట్ కొహ్లీ బెంగళూరు జట్టులో 2008 నుంచి కొనసాగుతున్నాడు. అంటే ఐపీఎల్ తొలి సీజన్ నుంచి అదే జట్టులో ఉన్నాడు. 2011లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 9 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నా.. ఆర్సీబీ జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ కూడా అందించలేకపోయాడు.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ రెండో దశ ప్రారంభమైన రోజే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) కెప్టెన్ విరాట్ కొహ్లీ (Viart Kohli) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా బెంగళూరు ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇప్పటికే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతానని ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసిన విరాట్ కొహ్లీ.. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేశాడు. ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత బెంగళూరు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని వెల్లడించాడు కొహ్లీ. ఐతే అదే జట్టులో ఆటగాడిగా మాత్ర కొనసాగుతానని స్పష్టం చేశాడు. కొహ్లీ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

  ''ఆర్సీబీ కెప్టెన్‌‌గా ఇదే నా చివరి ఐపీఎల్ సీజన్. ఐతే నా చివరి ఐపీఎల్ గేమ్ వరకు నేను ఆర్సీబీ ఆటగాడిగానే కొనసాగుతాను.  ఇన్నాళ్లు నాపై విశ్వాసం ఉంచి, మద్దతుగా నిలిచిన ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు.'' అని విరాట్ కొహ్లీ పేర్కొన్నారు. ఆ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

  సెకెండ్ ఫేజ్‌లో బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ముంబైపై విజయంతో టేబుల్ టాపర్‌గా సీఎస్కే

  IPL 2021 Rules: అక్కడ మ్యాచ్‌లు చూడాలంటే కఠిన నిబంధనలు... ప్రతీ స్టేడియానికి ప్రత్యేక కండిషన్లు

  విరాట్ కొహ్లీ బెంగళూరు జట్టులో 2008 నుంచి కొనసాగుతున్నాడు. అంటే ఐపీఎల్ తొలి సీజన్ నుంచి అదే జట్టులో ఉన్నాడు. 2011లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 9 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నా.. ఆర్సీబీ జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ కూడా అందించలేకపోయాడు. 2016లో కొహ్లీ కెప్టెన్సీలోనే ఫైనల్ వరకు వెళ్లింది ఆర్సీబీ టీమ్. కానీ ఫైనల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి.. టైటిల్‌ను చేజార్చుకుంది. ఆ సీజన్‌లో కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాట్‌తో అదరగొట్టాడు. ఏకంగా నాలుగు సెంచరీలు చేసి 973 రన్స్ చేశాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా ఇప్పటికీ ఆ రికార్డు కొహ్లీ పేరు మీదే ఉంది. ఇంకెవరూ ఒక సీజన్‌లో అన్ని పరుగులు చేయలేదు.

  Team India: ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన టీమ్ ఇండియా క్రికెటర్లు ఎవరో తెలుసా?

  ఇక ఈ సీజన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఆర్సీబీ టీమ్ మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన ఐదు మ్యాచ్‌లు గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. 10 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సాల కప్ నమదే (ఈసారి కప్పు మనదే) నినాదంలో ప్రతి ఏటా బరిలోకి దిగి ఆర్సీబీ జట్టు.. మరి ఈసారైనా కప్ గెలుస్తుందో లేదో చూడాలి. ఒకవేళ బెంగళూరు జట్టు ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఘనమైన వీడ్కోలు పలికినట్లే. ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీకి కొహ్లీకి గుడ్ బై చెప్పడంతో.. వచ్చే ఏడాది నుంచి ఆర్సీబీ జట్టుకు ఎవరు కెప్టెన్‌‌గా ఉంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, IPL 2021, RCB, Royal Challengers Bangalore, Sports, Virat kohli

  ఉత్తమ కథలు