IPL 2021 : ధనాధన్ ఐపీఎల్ సందడి మొదలైంది.. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం..!

IPL 2021

IPL 2021 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021(IPL 2021 Latest Telugu News) కి రంగం సిద్ధమవుతోంది. మరో ఎనిమిది రోజుల్లో ఫ్యాన్స్ ను అలరించడానికి ముస్తాబవుతోంది.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2021(IPL 2021 Latest Telugu News) కి రంగం సిద్ధమవుతోంది. మరో ఎనిమిది రోజుల్లో ఫ్యాన్స్ ను అలరించడానికి ముస్తాబవుతోంది. ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్ లు ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ్. ఇంగ్లండ్ నుంచి భారత కీ ప్లేయర్లు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా యూఏఈ గడ్డపై అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ (CSK vs MI) మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక, ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ లో అదిరిపోయే ప్రదర్శనతో టాప్‌లో నిలిచి ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) మెగా టోర్నీ కోసం ముమ్మర సాధన చేస్తోంది. క్వారంటైన్ పూర్తిచేసుకున్న ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక, ప్రాక్టీస్‌ పూర్తయ్యాక ఢిల్లీ ప్రాంచైజీ నిన్న రాత్రి ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడ ఆటగాళ్లు ఆటలు, పాటలతో సందడి చేశారు. మొదటగా ప్లేయర్స్ అందరూ సైగలతో కూడిన ఓ గేమ్ ఆడారు. ఇందులో శ్రేయాస్ అయ్యర్ బృందం ఓడిపోగా.. అమిత్ మిశ్రా టీం గెలుపొందింది. ఆ తరువాత కొందరు ప్లేయర్స్ అందరూ హిందీ పాటలతో అలరించారు.

  బాండింగ్ సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్స్ చివరగా డాన్స్ స్టెప్పులు వేశారు. స్టార్ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) కొత్త ఉత్సాహంతో సందడి చేశాడు. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన 'వాతి కమింగ్‌' పాటకు స్టెప్పులేస్తూ జట్టులో హుషారెత్తించాడు. జట్టు సిబ్బందితో కలిసి అక్కడి ఆటగాళ్లను ఖుషి చేశాడు.

  ఇంకా వివిధ ఆటలు, పాటలతో ఆటగాళ్లంతా మైమరచిపోయారు. ఇందుకు పాయింట్లు కూడా వేశారు. ప్లేయర్స్ ఆట, పాటలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పంచుకొని మరిచిపోలేని రాత్రి అంటూ ఆ ఢిల్లీ క్యాపిటల్స్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.


  రిషబ్ పంత్‌ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు సాదించించింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. పటిష్ట జట్లను సైతం ఓడించి ఔరా అనిపించింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టినా.. పంత్ ఆకట్టుకున్నాడు.

  ఇది కూడా చదవండి : తన ప్రేయసి కారణంగానే ఇషాన్ కిషన్ టీ-20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడా..?

  దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. డీసీ జట్టు ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ లెగ్‌ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది.ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ రోజు లేదా ఆదివారం యూఏఈ చేరుకోనున్నాడు.
  Published by:Sridhar Reddy
  First published: