Home /News /sports /

Kavya Maran: సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌ ఎన్ని కోట్లకు అధిపతి తెలుసా!

Kavya Maran: సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌ ఎన్ని కోట్లకు అధిపతి తెలుసా!

kavya maran family

kavya maran family

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు అక్కడ టక్కున మెరుస్తారు ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్. కెమెరాల ఫోకస్ కూడా ఆమెపైనే ఉంటుంది  సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు అక్కడ టక్కున మెరుస్తారు ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్. కెమెరాల ఫోకస్ కూడా ఆమెపైనే ఉంటుంది. పదే..పదే ఆమె హావాభావాలను చూపిస్తూ ప్రేక్షకులను కనువిందు చేస్తారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడినప్పుడు కావ్య కన్నీటి పర్యంతమైనప్పుడు ఎవరూ ఆమె చూడలేకపోయారు. పంజాబ్ జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపుతో ఆమె ముఖంలో నవ్వులు విరబూసాయి. ఆమె హవాభావాలకు సంబంధించిన మీమ్స్‌గా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సంతోషంలో ఉన్నప్పుడు కేరింతలు.. బాధగా ఉన్న బుంగ మూతి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

  . హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే అందరి చూపులు కావ్య మారన్‌పైనే ఉంటాయి. ఆమె కోసమే మ్యాచ్ చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే కావ్య మనకు సన్‌రైజర్స్ ఓనర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆమె పూర్తి జీవితం చాలా తక్కువ మందికి తెలుసు. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల కూతురే కావ్య మారన్. అమె వయస్సు 29 ఏళ్ళు. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. ఎంబీఏ పట్టా పోందిన కావ్య.. సన్ ‌నెట్‌వర్క్ సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ బాధ్యతలను చూసుకుంటుంది. త్వరలోనే సన్‌గ్రూప్‌ బాధ్యతలను మెుత్తం తనే చూసుకోబోతుంది.

  వన్ టీవీ నెట్ వర్క్‌ను 1990‌లో ప్రారంభించిన కళానిధి మారన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆసియా వ్యాప్తంగా విస్తరించారు. దాదాపు 300 కోట్లకు పైగా ఈ సంస్థ నెట్‌వర్త్‌గా ఉంది. దీనికి కావ్యనే వారసురాలు. అలాగే ఈ కుటుంబానికి పోలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. కావ్య తాత మురసోలి మారన్ డీఎంకే పార్టీ తరుపున యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే కావ్య పిన తండ్రి దయానిధి మారన్ మాజీ ఎంపీ. దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిది కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య కూడా.
  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Sun risers hyderabad

  తదుపరి వార్తలు