Home /News /sports /

IPL 2021 UMPIRES NITIN MENON PAUL REIFFEL PULL OUT IPL SA

IPL 2021: టోర్నీ నుంచి తప్పుకున్న మరొ ఇద్దరూ.. ఇలానే జరిగితే ఐపీఎల్‌ పరిస్థితి ఎంటీ! !

Umpires Nitin Menon, Paul Reiffel pull out of ipl

Umpires Nitin Menon, Paul Reiffel pull out of ipl

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తమ వృత్తి పరమైన జీవితానికి కరోనా అడ్డంకి కాకుడదని బయో బబుల్ లాంటి కష్టతరమైన నిబంధనల ఉంటున్నవారికి బయట జరుగుతున్న పరిణామాలు బయపెడుతున్నాయి.



    కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తమ వృత్తి పరమైన జీవితానికి కరోనా అడ్డంకి కాకుడదని బయో బబుల్ లాంటి కష్టతరమైన నిబంధనల ఉంటున్నవారికి బయట జరుగుతున్న పరిణామాలు బయపెడుతున్నాయి. దీంతో పలువురు ఐపీఎల్ 14 నుంచి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రవిచంద్రన్‌ అశ్విన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), ఆండ్రూ టై, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌(రాజస్థాన్‌ రాయల్స్‌), ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ (ఆర్సీబీ)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. తాజాగా భారత అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియా అంఫైర్ పాల్‌ రీఫెల్‌ కూడా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నారు. తాము ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐకి సమాచారం అందించారు. ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ సభ్యులైన వీరిద్దరూ ఐపీఎల్‌ నుంచి సడన్‌గా తప్పుకొవడంతో అసలు టోర్నీలో ఏం జరుగుతుందో ఎవరికి ఆర్ధం కావడం లేదు.

    మీనన్‌ తల్లికి, భార్యకు కరోనా ఇటివలే పాజిటివ్‌‌గా వచ్చింది. ఈ సమయంలో వారి పక్కన ఉండాలని భావించిన మీనన్‌ టోర్నీ నుంచి వైదొలిగారు. ఇటివలే ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌కు వచ్చే విమానాలపై అంక్షలు విధించిన నేపథ్యంలో అయోమయం గురైనా రీఫెల్‌ స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. వీరిద్దరూ తప్పుకున్న విషయాన్ని బీసీసీఐ సీనియర్‌ అధికారి వెల్లడించారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Corona drug, Corona effect, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు