హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: ఇండియా నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్దామని అనుకుంటున్నారా..? అయితే వీరికి మాత్రమే ఎంట్రీ..!

IPL 2021: ఇండియా నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్దామని అనుకుంటున్నారా..? అయితే వీరికి మాత్రమే ఎంట్రీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులను అనుమతించనున్నట్టుగా ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

  ఐపీఎల్ 2021 (IPL 2021)సెకండాఫ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులను అనుమతించనున్నట్టుగా ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనున్న మ్యాచ్‌ నుంచి ప్రేక్షకులను అనుమతించనున్నట్టుగా తెలిపారు. కరోనా కారణంగా గతేడాది నుంచి ఐపీఎల్(IPL) మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించలేదు. ఐపీఎల్ 13 సీజన్ యూఏఈలో జరగగా.. పూర్తిగా అభిమానులు లేకుండానే నిర్వహించారు. ఐపీఎల్ 14(IPL 14) తొలిదశలో కూడా అభిమానులకు ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో స్టేడియాల్లో అభిమానుల సందడి, అరుపులు లేకుండానే మ్యాచ్‌లు సాగాయి. కానీ టీవీలో మాత్రం స్టేడియాల్లో అభిమానులు ఉన్నారనే విధంగా సౌండ్ మిక్సింగ్ చేసి ప్రసారం చేశారు.

  అయితే తాజాగా ఐపీఎల్ 14 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకన్నారు. మ్యాచ్‌లను చూసేందుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ఐపీఎల్‌ (Indian Premier League) నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన టికెట్లు అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com తో పాటుగా PlatinumList.netలో కూడా అందుబాటులో ఉండనున్నట్టుగా బీసీసీఐ తెలిపింది. కోవిడ్ నిబంధనలు, యూఏఈ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పరిమిత సిట్టింగ్‌తో అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.

  Ravi Shastri: త్వరలో కోహ్లీ సేనకు కొత్త కోచ్.. గుడ్ బై చెప్పనున్న రవిశాస్త్రి.. రేసులో ఉన్నది వీళ్లే...


  ‘ఈసారి BCCI, UAE ప్రభుత్వం స్టేడియంలోకి పాక్షికంగా ప్రేక్షకులను అనుమతించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB) కూడా కోవిడ్ కేసులను తనిఖీ చేయడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తోంది’అని బీసీసీఐ(BCCI) అధికారి ఒకరు చెప్పారు. అయితే పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతించనున్నారు. ప్రేక్షకులు స్టేడియంలోని ప్రవేశించడానికి ముందు.. కోవిడ్ వ్యాక్సినేషన్ స్టేటస్‌ సమర్పించాల్సి ఉంటుంది.

  CPL Chris Gayle: వాట్ ఏ బాల్‌.. కుర్ర బౌల‌ర్ ధాటికి రెండు ముక్క‌లైన క్రిస్ గేల్ బ్యాట్‌


  భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ముఖ్యంగా కొవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారు. అయితే యూఏఈలో జరిగే మ్యాచ్‌లకు హాజరు కావాలనుకునే ప్రేక్షకులు.. కొవిషీల్డ్ (Covishield) రెండు డోసులు తీసుకన్న ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. కోవ్యాక్సిన్ తీసుకున్న వారికి మ్యాచ్‌లు చూసేందుకు అనుమతించరు.

  IPL 2021: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. ఆన్‌లైన్‌లో టికెట్లు ఎప్పటి నుంచి అంటే..


  ఈ  ఐపీఎల్ 14లో మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: IPL, IPL 2021, UAE

  ఉత్తమ కథలు