Home /News /sports /

IPL 2021 UAE GOVERNMENT NOT ALLOWING TEAM INDIA CRICKETERS DIRECTLY FROM ENGLAND NEW NORMS FOR IPL PLAYERS JNK

IPL 2021: యూఏఈ ప్రభుత్వం కొత్త మెలిక.. టీమ్ ఇండియాకు కొత్త తిప్పలు.. కారణం అదేనా?

యూఏఈ గవర్నమెంట్ కొత్త మెలిక.. ఆ ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

యూఏఈ గవర్నమెంట్ కొత్త మెలిక.. ఆ ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

యూఏఈ వెళ్లనున్న ఆటగాళ్ల కోసం అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. గతంలో టీమ్ ఇండియా ఆటగాళ్లను నేరుగా అనుమతించడానికి అంగీకరించిన యూఏఈ.. ఇప్పుడు వారిని క్వారంటైన్‌కు పంపనున్నది.

    యూఏఈ (UAE) వేదికగా ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈ తీసుకొని వచ్చి ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న టీమ్ ఇండియా (Team India) ఆటగాళ్లు కూడా ఐపీఎల్ రెండో దశ కోసం యూఏఈ వెళ్లాల్సి ఉన్నది. షెడ్యూల్ ప్రకారం 5వ టెస్టు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 14 లేదా 15న యూఏఈకి బయలుదేరాల్సి ఉన్నది. అయితే కోవిడ్ కలకలం కారణంగా టీమ్ ఇండియా అంతకంటే ముందే యూఏఈ వెళ్లనున్నది. అయితే ఇంగ్లాండ్ నుంచి వెళ్లనున్న టీమ్ ఇండియా ఆటగాళ్లు తప్పని సరిగా 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని యూఏఈ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఇంగ్లాండ్‌లో జట్టులోని సహాయక సిబ్బంది, హెడ్ కోచ్ కోవిడ్ బారిన పడటంతోనే వీరికి క్వారంటైన్ నిబంధన విధించినట్లు తెలుస్తున్నది.

    వాస్తవానికి ఇండియా-ఇంగ్లాండ్  (India Vs England) సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లు, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL) పాల్గొనే ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన వర్తించదని ముందుగా పేర్కొన్నారు. ఆయా ఆటగాళ్లందరూ బయోబబుల్ నుంచి వస్తున్నారు కాబట్టి వారికి క్వారంటైన్ నిబంధనను ఎత్తేశారు. కానీ తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాలో కరోనా కేసులు నమోదవడంతోనే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక యూఏఈ రానున్న ఆటగాళ్లందరికీ కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. క్రికెటర్లు, సహాయక సిబ్బంది అందరినీ గమనించేందుకు ప్రత్యేకంగా బబుల్ మేనేజర్లను నియమించనున్నారు. వీరు ఆటగాళ్ల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తూ ఉంటారు. ఐపీఎల్ రెండో దశ కోసం 14 బయోబబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 8 బబుల్స్ ఫ్రాంచైజీల కోసం ఏర్పాటు చేయనుండగా.. మిగిలినవి బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, కామెంటేటర్లు, మ్యాచ్ అఫీషియల్స్ కోసం కేటాయించనున్నారు.

    IPL 2021: వాళ్లిద్దరి కోసం ప్రత్యేక విమానం.. ఇంగ్లాండ్ నుంచి యూఏఈకి తరలించడానకి ఆ ఫ్రాంచైజీ ప్లాన్


     బయోబబుల్ లోనికి వెళ్లిన ఆటగాడిని, అధికారిని అసలు బయటకు వెళ్లడానికి అనుమతించరు. ఒక వేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... తిరిగి రావడానికి కనీసం ఆరు సార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహించి... వాటిలో నెగెటివ్ వస్తేనే అనుమతిస్తారు. బయోబబుల్ మొత్తం బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో నడుస్తుంది. హోటల్ రూమ్‌లలో కూడా క్రీడాకారులు తప్ప ఎవరూ కలసి ఉండటానికి వీలుండదు. క్రికెటర్ల భార్యలు, బంధువులు కూడా బయోబబుల్‌లో ఉన్నా.. వారిని మాత్రం కలుసుకోవడానికి బీసీసీఐ అనుమతించబోవడం లేదు. ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈలోనే టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. అయితే ఆ ఈవెంట్ మొత్తం ఐసీసీ కనుసన్నల్లో నడువనున్నది కాబట్టి.. దానికి ప్రత్యేకమైన నిబంధనలు అమలు కానున్నాయి.

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు