• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 SUSPENDED KHATAM TATA BYE BYE RAJASTHAN ROYALS PLAYER RIYAN PARAGS HILARIOUS TWEET GOES VIRAL IN SOCIAL MEDIA SRD

IPL 2021 : ఖతమ్.. టాటా.. బైబై.. అంటున్న యంగ్ క్రికెటర్..చిక్కావు నా రాజా అంటున్న మీమర్స్..

IPL 2021 : ఖతమ్.. టాటా.. బైబై.. అంటున్న యంగ్ క్రికెటర్..చిక్కావు నా రాజా అంటున్న మీమర్స్..

IPL 2021 : ఐపీఎల్ వాయిదా పడటంతో మన ఆటగాళ్లు.. ఇంటి బాట పట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ చేసిన ఓ ట్వీట్.. మీమర్స్ పండగలా మారింది. ఈ యంగ్ ప్లేయర్ ట్వీట్ తో మీమ్స్ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.

  • Share this:
    భారత్ లో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కరోనా మహమ్మారి దెబ్బకి అన్ని రంగాలు షేక్ అవుతున్నాయ్. క్రీడా రంగంపై కూడా కరోనా కన్ను పడింది. ఎంతో ఆసక్తిగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ. పటిష్ట బయో బబుల్ ను కూడా బద్దలు కొట్టి... కరోనా ఎంట్రీ ఇచ్చి.. ఆటగాళ్లను షేక్ చేసింది. వరుసగా ఆటగాళ్లు... సిబ్బంది కరోనా బారిన పడటంతో ఏమి చేయాలో పాలు పోక బీసీసీఐ ఐపీఎల్ సీజన్ ను రద్దు చేసింది. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ ప్లేయర్ అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతకముందు కోల్ కతా ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగానే కోల్ కతా, బెంగళూరు మ్యాచ్ వాయిదా పడింది. ఆ తర్వాత చెన్నై కోచ్ లక్ష్మీ పతి బాలాజీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రతి టీంలోనూ వైరస్ బాధితులు పెరుగుతుండటంతో... ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్ వాయిదా పడటంతో.. మనోళ్లతో పాటు, విదేశీ ఆటగాళ్లని కూడా తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది బీసీసీఐ.

    ఐపీఎల్ వాయిదా పడటంతో మన ఆటగాళ్లు.. ఇంటి బాట పట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ చేసిన ఓ ట్వీట్.. మీమర్స్ పండగలా మారింది. ఆయన ట్వీట్ తో మీమ్స్ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో.. రియాన్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మనోడి ట్వీట్ తో మీమర్స్ పండుగ చేసుకుంటున్నారు.








    ఇంతకీ రియాన్ చేసిన ట్వీట్ ఏంటంటే..." ఖతమ్, టాటా, బై బై, " అని ట్వీట్ చేసి ఐపీఎల్ ని కూడా ట్యాగ్ చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ క్యాన్సిల్ అనే ట్యాగ్ కూడా చేశాడు. దీంతో, ఈ ట్వీట్ ను మీమర్స్ ట్రోల్ చేయడం విశేషం. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. బాలీవుడ్ సినిమాల్లోని ఫోటోలతో ట్రోల్ చేశారు. ఈ సీజన్ రద్దు అయినందుకు రాజస్టాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైజర్స్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారనే అర్థం వచ్చేలా మీమ్స్ చేయడం విశేషం. ఎందుకంటే ఈ సీజన్ లో చెత్తగా ఫర్మామ్ చేసింది ఈ మూడు జట్లే కావడం గమనార్హం. కొందరేమో పరాగ్ డ్యాన్స్ మిస్ అయ్యామంటూ కామెంట్స్ పెట్టడం విశేషం. మరి కొందరు రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యల్ని మనోడి ట్వీట్ కు ఆపాదిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: