Home /News /sports /

IPL 2021 SUSPENDED AUSTRALIAN CRICKETER DAVID WARNER RECIVED A HEARTFELT MESSAGE FROM HIS DAUGHTERS SRD

IPL 2021 : ప్లీజ్ డాడీ..డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయ్..కంట తడి పెట్టిస్తోన్న వార్నర్ కూమార్తెల మేసేజ్..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

IPL 2021 : స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన సంగతి తెలిసిందే.

  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ కరోనా కారణంగా మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. బయోబబుల్ లో ఉన్న పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం.. ఆ తర్వాత మ్యాచ్ లు వాయిదా పడటం.. మరో టీమ్ లో కరోనా కలకలం ఇలా అన్ని చకాచకా జరిగిపోయాయ్. దీంతో ఏం చేయాలో పాలుపోక.. మిగతా సీజన్ ను బీసీసీఐ (BCCI) పూర్తిగా వాయిదా వేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ సీజన్ ను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మన ఆటగాళ్లతో పాటు.. ఫారెన్ ప్లేయర్లు కూడా ఎవరి దేశానికి వారు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఐపీఎల్ లో పాల్గొన్న ప్రతి విదేశీ ఆటగాడిని స్వదేశాలకు పంపించడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. అయితే, మరో పక్క..ఆస్ట్రేలియా క్రికెటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆస్ట్రేలియా లో కఠిన ఆంక్షల నేపథ్యంలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా వార్నర్‌ కూతుర్లు ఇవీ, ఇండీ, ఇస్లాలు తన తండ్రిని మిస్‌ అవుతూ గీసిన ఒక డ్రాయింగ్‌ వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన దానిని వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. "ప్లీజ్‌ డాడీ.. ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేయ్‌. నిన్ను చాలా మిస్సవుతున్నాం. లవ్‌ యూ డాడీ. ఫ్రమ్‌ ఇండీ, ఇవీ, ఇస్లా" అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఈ డ్రాయింగ్‌ను ఇవీ గీసిందని వార్నర్‌ చెప్పాడు.

  ఐపీఎల్‌ 2021లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు కెప్టెన్‌గా విఫలమవుతున్న కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. కేన్‌ విలియమ్సన్‌ సారథిగా ప్రకటించింది. డేవిడ్ వార్నర్‌ 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అదే ఏకైక టైటిల్‌. ఆ తర్వాతి ఏడాది ప్లేఆఫ్స్‌ చేర్చాడు. బాల్‌ టాంపరింగ్‌ నిషేధం కారణంగా 2018 సీజన్‌కు దూరమయ్యాడు. 2019లో ఆటగాడిగానే కొనసాగినా.. తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని మరోసారి సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్‌ తీసుకెళ్లాడు.  ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ద్వారా ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టంగా హైదరాబాద్ మార్చుకుంది. ప్లేఆఫ్ వెళ్లడం దాదాపు అసాధ్యమే. తాజాగా ఐపీఎల్ 2021 వాయిదాతో సన్‌రైజర్స్ జట్టు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీగా మీమ్స్‌, కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. వీటిని పక్కన పెడితే..ఆసీస్ ఆటగాళ్లు ఫస్ట్ మాల్దీవులు కు వెళ్లి.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: David Warner, IPL 2021, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు