IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పులు.. ఒక ఆల్‌రౌండర్ దూరం.. మరో పేసర్ జట్టులోకి..

సన్‌రైజర్స్ హైదారబాద్ జట్టులో కీలక మార్పులు (PC: IPL)

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ అనివార్య కారణాల వల్ల జట్టును వీడి వెళ్లిపోయాడు. మరోవైపు నటరాజన్ స్థానంలో మరో బౌలర్‌ను తాత్కాలికంగా తీసుకున్నారు.

 • Share this:
  ఐపీఎల్ 2021లో (IPL 2021) అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు గాను కేవలం ఓకే మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు మూసేసుకున్నది. ఇక మిగిలిన ఆరు మ్యాచ్‌లు వరుసగా గెలిచినా.. చివరల్లో నెట్‌రన్‌రేట్.. ఇతర జట్ల ప్రదర్శన అనంతరమే ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుతున్నది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగే మ్యాచ్‌లో కనుక ఓడిపోతే సన్‌రైజర్స్ రేసు ముగిసినట్లే. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆ జట్టు ఆల్‌రౌండర్ దూరం కావడంతో మరోసారి కష్టాల్లో పడింది. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ అర్దాంతరంగా జట్టును వీడి స్వదేశానికి వెళ్లిపోయాడు. రూథర్‌ఫర్డ్ తండ్రి చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది.

  ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో (Johnny Bairstow) రెండో దశలో అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో రూథర్‌ఫర్డ్‌ను తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లోని గయానాకు చెందిన రూథర్‌ఫర్డ్ ఒక స్టార్ ఆల్‌రౌండర్. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన రూథర్‌ఫర్డ్ మొత్తం 73 పరుగులు చేశాడు. ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ జట్టులో రూథర్‌ఫర్డ్ సభ్యుడు. సీపీఎల్ 2021లో రాణించడంతోనే అతడితో సన్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకున్నది.

  Sara Tendulkar Hot Images: జిమ్ డ్రెస్‌లో తన అందాలను చూపిస్తున్న సారా టెండుల్కర్.. వైరల్ ఫొటోలు


  ఇక సన్‌రైజర్స్ కీలక పేసర్ టి. నటరాజన్ (T Natarajan) కోవిడ్ బారిన పడటంతో జట్టుకు దూరమయ్యాడు. అతడితో సన్నిహితంగా ఉన్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక సమయంలో ఆటగాళ్లను దూరం చేసుకున్నట్లు అయ్యింది. తాజాగా టి. నటరాజన్ స్థానంలో జమ్ము కశ్మీర్‌కి చెందిన పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఐపీఎల్ నిబంధన 6.1(సీ) ప్రకారం అనుకోని కారణాల వల్ల లీగ్ మధ్యలో ఎవరైనా ఆటగాడు దూరమైతే కొత్త ఆటగాడిని తీసుకునే వీలుంది. ఈ వెసులు బాటును ఉపయోగించుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకున్నది. ప్రస్తుతం అతడు జట్టులో నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. ఇకపై తుది జట్టుకో ఆడటానికి అవకాశం లభిస్తుంది. కాగా, సన్‌రైజర్స్ జట్టు శనివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనున్నది.
  Published by:John Naveen Kora
  First published: