IPL 2021 SUNRISERS HYDERABAD COMES AGAIN WITH EDITED POST AND THIS TIME MANISH PANDEY SRD
IPL 2021 : రం..సమరం.. కత్తి పట్టి దూసుకొస్తున్న వీర మనీశ్ పాండే...ఇక రచ్చ రంబోలా..
Photo Credit : Twitter
IPL 2021 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ (IPL) పండుగ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా జరగనుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (srh) ఏప్రిల్ 11 న తమ వేట మొదలుపెట్టనుంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ (IPL) పండుగ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా జరగనుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (srh) ఏప్రిల్ 11 న తమ వేట మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 11 న కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇప్పటికే చెన్నై, కోల్ కతా లాంటి జట్టు ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టాయ్. ప్రతి జట్టు తమ ప్లేయర్ అద్భుతంగా రాణించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్న పోస్ట్ లు ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయ్. మొన్నటికి మొన్న కేన్ విలియమ్సన్ పై పోస్ట్ పెట్టగా..లేటెస్ట్ గా మనీశ్ పాండే పోస్ట్ తో ఫ్యాన్స్ ముందుకొచ్చింది. భారత యువ ఆటగాడు మనీశ్ పాండే..(Manish Pandey)సన్‌రైజర్స్ టీంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతూ వికెట్లు పడకుండా పరుగులు చేస్తున్నాడు. మనీశ్ పాండే సన్‌రైజర్స్ టీంలో కీలక ఆటగాడు కాబట్టి.. ఐపీఎల్ 2021లో అతడు ఎలా ఆడాలని కోరుకుంటుందో తాజాగా ఆ జట్టు యాజమాన్యం ఓ ట్వీట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన " అరవింద సమేత" సినిమాలోని ఓ పోస్టర్‌ను సన్‌రైజర్స్ ఎడిట్ చేసింది. కత్తి పట్టుకొని పరుగెత్తుతున్న ఎన్టీఆర్ పోస్టర్‌ను మనీశ్‌తో ఎడిట్ చేసింది. ఆ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
" మనీశ్ పాండే నుంచి ఏం కోరుకుంటామో మనకు తెలిసిందే. నిర్దాక్షిణ్యంతో కూడిన బ్యాటింగ్" అని కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ అభిమానులు ఈ పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కత్తిపట్టిన మనీష్ పాండే.. ఇక రచ్చరచ్చే" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఎన్టీఆర్లానే మనీష్ కూడా రెచ్చిపోవాలి" అని మరొకరు కామెంట్ చేశారు.
ఇక, గుజరాత్ నుంచి ఐపీఎల్ జట్టు లేకున్నప్పటికీ.. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. కానీ హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా పెట్టడం లేదు. హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. బెంగళూరు, ముంబైతో పోల్చితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఐనప్పటికీ ఆ రెండు నగరాలకు చోటిచ్చి.. హైదరాబాద్‌కు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు హెచ్‌సీఐ ఛైర్మన్ అజారుద్దీన్ కూడా బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మ్యాచ్‌లను నిర్వహించాలని కోరారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రభుత్వం తరపున అన్ని సహకారాలు అందిస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐనా బీసీసీఐ పట్టించుకోలేదు. కేవలం 6 స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.