• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • IPL 2021 SUNRISERS HYDERABAD CEO KAVIYA MARAN STUNNED BY PBKS FIELDER RAVI BISNOIS CATCH SRD

Kaviya Maran : ప్రత్యర్థి జట్టు ప్లేయర్ ఫీల్డింగ్ కు కావ్య పాప ఫిదా..ఆ ఫీల్డర్ ఎవరో తెలుసా..

Kaviya Maran : ప్రత్యర్థి జట్టు ప్లేయర్ ఫీల్డింగ్ కు కావ్య పాప ఫిదా..ఆ ఫీల్డర్ ఎవరో తెలుసా..

Kaviya Maran : కావ్య మారన్.. ఈ సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది ఈ భామ. ఆమె ఏం చేసినా ఇట్టే వైరలవుతోంది. ఇక, ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే, ఆమె గురించే సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

  • Share this:
    కరోనా కాలంలో ఐపీఎల్ 2021 సీజన్ కాస్తా కూస్తో ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ప్రతి మ్యాచ్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. భారీ స్కోరు నమోదు కాకపోయినా.. చివరి వరకు జరగుతున్న మ్యాచ్ లు ఉత్కంఠను రేపుతున్నాయ్. ఇక, ఈ సీజన్ లో అందరిని కళ్లు మాత్రం కావ్యమారన్ (Kaviya Maran) పైనే. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది ఈ భామ. సన్ రైజర్స్ సీఈవో అయిన కావ్య గురించి దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇక, హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు కావ్య మారన్. మ్యాచ్‌లను చూస్తూ తనను తాను మర్చిపోతుంటారు. తన ఎమోషన్స్‌ను ఏ మాత్రం దాచుకోలేకపోతుంటారు. జట్టు గెలిస్తే.. ఎగిరి గంతేయడం, ఓడిపోతే.. కంటనీరు పెట్టుకోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఆ ఎమోషన్స్‌తోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తనలోని భావోద్వేగాన్ని కావ్య మారన్ మరోసారి బయటపెట్టుకున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన ఓ క్యాచ్ ఆమెను కట్టిపడేసింది. ఆ క్యాచ్ పట్టిన ఫీల్డర్‌ను ఆమె ఆకాశానికెత్తేశారు. ఇలాంటి ఫీట్ ఇప్పటిదాకా చూడలేదంటూ ప్రశంసించారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటిదాకా నమోదైన అన్నింట్లోకి ఇదే అత్యుత్తమ క్యాచ్‌గా ఆమె అభివర్ణించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

    ఆ క్యాచ్- పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ పట్టినది. కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ను పెవిలియన్ పట్టించడానికి రవి బిష్ణోయ్ పట్టిన క్యాచ్.. ఆ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కత నైట్ రైడర్స్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. సునీల్ నరైన్ కూడా డకౌట్ అయ్యాడు. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఉన్న సమయంలో సునీల్ అవుటయ్యాడు.


    అర్ష్‌దీప్ సింగ్ సంధించిన లెంగ్త్ బంతిని డీప్ మిడ్ వికెట్ వైపు భారీ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని రవి బిష్ణోయ్ అందుకున్న తీరు అద్భుతమే. తన కుడివైపు పరుగులు పెట్టి.. గాల్లోకి డైవ్ చేసి మరీ దాన్ని అందుకున్నాడతను. ఆది క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కావ్య మారన్ ప్రశంసించారు. స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీలు రవి బిష్ణోయ్ ఫీట్ పట్ల సర్‌ప్రైజ్ అయ్యారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్‌గా కాంప్లిమెంట్స్ చేశారు. ఇక, ఈ మ్యాచ్ లో విజయం కోల్ కతా ను వరించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న KKR ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించి..ఆత్మ విశ్వాసాన్ని తిరిగి సొంతం చేసుకుంది.
    Published by:Sridhar Reddy
    First published: