• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 STAR SPORTS RELEASED NEW ENGAGING ANTHEM FOR THIS SEASON AND IT GOES VIRAL SRD

IPL 2021 : ఐపీఎల్ 2021 సాంగ్ రిలీజ్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డ్యాన్స్ ఇరగదీశారుగా..

IPL 2021 : ఐపీఎల్ 2021 సాంగ్ రిలీజ్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డ్యాన్స్ ఇరగదీశారుగా..

Photo Credit : Twitter

IPL 2021 : ఐపీఎల్ 2021 సీజన్ కోసం బీసీసీఐ రెడీ అవుతోంది. ఏర్పాట్లన్నీ చకాచకా జరిగిపోతున్నాయ్. ఇప్పటికే ఈ సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. టోర్నీ ఆరంభానికి రోజులు దగ్గరపడుతుండటంతో ప్రాక్టీస్ క్యాంప్‌లు నిర్వహించేందుకు ఆయా జట్లు సన్నదమవుతున్నాయి.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ కోసం బీసీసీఐ రెడీ అవుతోంది. ఏర్పాట్లన్నీ చకాచకా జరిగిపోతున్నాయ్. ఇప్పటికే ఈ సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. టోర్నీ ఆరంభానికి రోజులు దగ్గరపడుతుండటంతో ప్రాక్టీస్ క్యాంప్‌లు నిర్వహించేందుకు ఆయా జట్లు సన్నదమవుతున్నాయి. ఈ సీజన్ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. 6 సిటీలు టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇక, ప్రతి సీజన్ కోసం డిఫరెంట్ స్టైల్ లో సాంగ్ ను రిలీజ్ చేయడం బీసీసీఐకి అలవాటు. అలాగే, ఈ ఏడాది సీజన్ కు సంబంధించి కూడా అఫీషియల్ సాంగ్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సాంగ్ కూడా ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా ఆకట్టుకుంటోంది. ఇండియా సక్సెస్ మంత్రంతో మొదలైన ఐపీఎల్ 2021 సాంగ్.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేలా కనిపిస్తోంది. స్కూల్‌ పిల్లలతో మొదలెట్టి.. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా ఈ సాంగ్‌లో భాగస్వామ్యుల్ని చేసే ప్రయత్నం చేశారు. చివరిగా విరాట్ కోహ్లీ (RCB), రోహిత్ శర్మ(MI)తో పాటు కేఎల్ రాహుల్ (KP), శుభమన్ గిల్ (KKR), రిషబ్ పంత్ (DC), సాహా (SRH), రియాన్ పరాగ్ (RR), కృష్ణప్ప గౌతమ్ (CSK) రూపంలో అన్ని జట్లలోని ఆటగాళ్లు ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ మొత్తం 52 రోజులపాటు ఈ టోర్నీ జరగనుండగా.. చెన్నై, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ సిటీలు మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఏ జట్టుకీ తన సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఫస్ట్ మ్యాచ్‌‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.


    2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఆదరణ, ఆదాయం పరంగా క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రైవేట్ టీ20 లీగ్‌లో ఘనత సాధించింది. ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగియగా.. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఇప్పటికే చెన్నై, కోలకతా లాంటి టీమ్ లు ట్రైనింగ్ క్యాంప్ ల్ని మొదలుపెట్టాయ్.
    Published by:Sridhar Reddy
    First published: