• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 SRH VS RCB LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE WON BY 6 RUNS SRD

SRH vs RCB: గెలవాల్సిన మ్యాచ్ లో చేతులేత్తేసిన SRH.. కోహ్లీసేనదే విక్టరీ..

SRH vs RCB: గెలవాల్సిన మ్యాచ్ లో చేతులేత్తేసిన SRH.. కోహ్లీసేనదే విక్టరీ..

SRH vs RCB

SRH vs RCB: మరోసారి మిడిలార్డర్ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచ్ ను ప్రత్యర్థి టీమ్ కు అప్పనంగా అప్పగించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫలితంగా ఈ సీజన్ లో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసుకుంది.

  • Share this:
    గెలవాల్సిన మ్యాచ్ లో చేతులేత్తేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆఖర్లో తడబడి మ్యాచ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అప్పగించింది. ఫలితంగా..6 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆరెంజ్ ఆర్మీ. మరోసారి మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం కన్పించింది. వార్నర్ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన కీలక దశలో ఔటవ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వార్నర్ ఉన్నంతసేపు అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ .. కాస్తా ఆర్సీబీ వశమైంది. వార్నర్ 37 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. మనీశ్ పాండే 39 బంతుల్లో 38 పరుగులతో మరోసారి స్లో ఇన్నింగ్స్ ఆడి.. జట్టుపై ఒత్తిడి పెంచాడు. యంగ్ క్రికెటర్ షాబాజ్ అహ్మద్ రెండు ఓవర్లలో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇన్నింగ్స్ 17 వ ఓవర్ లో వరుసగా బెయిర్ స్టో, మనీశ్ పాండే, సమద్ ల వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బ తీశాడు షాబాజ్ అహ్మద్. ఆఖర్లో రషీద్ ఖాన్ 9 బంతుల్లో 17 పరుగులు చేసిన అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో వరసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరసగా రెండో విక్టరీ నమోదు చేసి.. పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై చెలరేగిన వార్నర్.. డానియల్ క్రిస్టియన్ వేసిన 12 ఓవర్ తొలి బంతికి క్విక్ డబుల్ తీసి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఆర్‌సీబీపై డేవిడ్ భాయ్‌కు 8వ హాఫ్ సెంచరీకాగా.. ఈ సీజన్‌లో ఇదే ఫస్ట్ ఫిఫ్టీ.

    మరోవైపు ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ తడబడింది. బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ గ్లెన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ).. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 150 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ ఫీల్డింగ్‌ తోడవడంతో ఆర్‌సీబీ టపటపా వికెట్లు కోల్పోయింది. అయితే మ్యాక్సీకి తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) పర్వాలేదనిపించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది.పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగారు.

    వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఓ దశలో ఆర్‌సీబీ కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై మ్యాక్సీ తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు. మొత్తానికి చెత్త బ్యాటింగ్ తో గెలిచే మ్యాచ్ ను పొగొట్టుకుంది సన్ రైజర్స్.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు