• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IPL 2021 SRH VS RCB LIVE UPDATES ROYAL CHALLENGERS BANGALORE SETS NORMAL TARGET SRD

SRH vs RCB: అదరగొట్టిన సన్ రైజర్స్ బౌలర్స్.. RCBని ఆదుకున్న మ్యాక్సీ..టార్గెట్ ఎంతంటే..

SRH vs RCB: అదరగొట్టిన సన్ రైజర్స్ బౌలర్స్.. RCBని ఆదుకున్న మ్యాక్సీ..టార్గెట్ ఎంతంటే..

SRH vs RCB

SRH vs RCB: టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే షాక్ తగిలింది. లీగ్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌(13 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. భువనేశ్వర్‌ వేసిన 3వ ఓవర్‌లో మిడ్‌ వికెట్‌లో షాబాజ్‌‌ నదీమ్‌ అద్భుతమైన లో క్యాచ్‌ అందుకోవడంతో అతను పెవిలియన్‌ బాట పట్టాడు.

  • Share this:
    సన్ రైజర్స్ తో జరుగుతున్న పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. మ్యాక్స్ వెల్ మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమవ్వడంతో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితమైంది. మ్యాక్స్ వెల్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కోహ్లీ 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. జాసన్ హోల్డర్ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే షాక్ తగిలింది. లీగ్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌(13 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. భువనేశ్వర్‌ వేసిన 3వ ఓవర్‌లో మిడ్‌ వికెట్‌లో షాబాజ్‌‌ నదీమ్‌ అద్భుతమైన లో క్యాచ్‌ అందుకోవడంతో అతను పెవిలియన్‌ బాట పట్టాడు. తొలి వికెట్‌ కోల్పోయాక ఆర్‌సీబీ ఆచితూచి ఆడింది. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన షాబాజ్‌ అహ్మద్‌(10 బంతుల్లో 14; సిక్స్‌)..స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ అందించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. రెండు వికెట్లు కోల్పోయాక ఆర్‌సీబీ స్కోర్‌ నెమ్మదించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 9 ఓవర్ల అనంతరం ఆర్‌సీబీ స్కోర్‌ 58/2. అయితే, 11 ఓవర్ నుంచి గేర్ మార్చాడు మ్యాక్స్ వెల్. షాబాజ్‌ నదీమ్‌ వేసిన 11వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ విరుచుకుపడ్డాడు. వరుసగా 6,4,6 పరుగులు పిండుకున్నాడు. అనంతరం సింగల్‌ తీసి కోహ్లికి స్ట్రయిక్‌ ఇవ్వగా అతను కూడా మరో బౌండరీ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. అయితే, నిలకడగా ఆడుతున్న ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి(29 బంతుల్లో 33; 4 ఫోర్లు).. హోల్డర్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరాడు. బంతిని ఫ్లిక్‌ చేసే ప్రయత్నంలో టాప్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో కోహ్లి పెవిలియన్‌ బాట పట్టాల్సి వచ్చింది.

    13వ ఓవర్‌ తొలి బంతికి కెప్టెన్‌ కోహ్లి వికెట్‌ను కోల్పోయిన ఆర్‌సీబీ, ఆ మరుసటి ఓవర్‌ నాలుగో బంతికే డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌(5 బంతుల్లో 1) వికెట్‌ను కూడా చేజార్చుకుని కష్టాల్లో చిక్కుకుంది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో షార్ట్‌ కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఏబీ పెవిలియన్‌ బాట పట్టాడు. స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆర్‌సీబీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. వరుసగా డివిలియర్స్‌, సుందర్‌(11 బంతుల్లో 8; ఫోర్‌)ల వికెట్లు తీసి ఆర్‌సీబీని కష్టాల్లోకి నెట్టాడు. రషీద్‌ బౌలింగ్‌లో మనీశ్‌ పాండే అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో సుందర్‌ పెవిలియన్‌ చేరాడు.

    ఆ తర్వాత నటరాజన్‌ బౌలింగ్‌లో బాటమ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో వికెట్‌ కీపర్‌ సాహా చేతికి క్యాచ్‌ ఇచ్చి డేనియల్‌ క్రిస్టియన్‌(2 బంతుల్లో 1) వెనుదిరిగాడు. ఆఖర్లో మ్యాక్స్ వెల్ బ్యాటు ఝళిపించడంతో ఆర్ సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.ఇక హెడ్ టు హెడ్ రికార్డుల్లో సన్ రైజర్స్ దే పై చేయి.
    Published by:Sridhar Reddy
    First published: